Jitheder Reddy: చావుకు ఎదురెళ్లిన అసలు సిసలు జాతీయవాది జితేందర్ రెడ్డి.. సినిమాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు..

Tue, 12 Nov 2024-3:39 pm,
jithender reddy fight against naxalights

Jitheder Reddy:రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషించిన  చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలను తెరకెక్కించిన  విరించి వర్మ డైరెక్షన్  వహించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా తాడిత పీడిత ప్రజల కోసం ఒకపుడు పోరాడిన కామ్రేడ్స్ ..  ఆ తర్వాత దారి తప్పారు. వారి అరాచకాలను ఎదురొడ్డి నిలిచిన అసలు సిసలు స్వయంసేవకుడు జాతీయ వాది జితేందర్ రెడ్డి.

Jithender Reddy

ముదుగంటి క్రియేషన్స్ పై జితేందర్ రెడ్డి సోదరుడు ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ సినిమాను  నిర్మించారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కడం ఆసక్తికర అంశం. ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

 

jithender Reddy With Kishan Reddy

తాజాగా ఈ సినిమాను చూసిన  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారి తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.తాను చావుకు ఎదురు వెళ్తున్నానని తెలిసి కూడా వెన్నుతిరగని పోరాట యోధుడని కొనియాడారు. రాకేష్ వర్రే జాతీయవాది జితేందర్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయిన తీరును ప్రశంసించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

గతంలో తాను జితేందర్ రెడ్డి గారు కలిసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా  గుర్తు చేసుకున్నారు. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,  అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్తగా వ్యవహరించారు. ఆయన అప్పట్లోనే పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎంతో పాటు పడ్డారు. వాళ్ల కోసం నిలబడిన వ్యక్తి. జాతీయ భావజాలంతో, వీరోచిత పోరాట పటిమతో చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి.

వరంగల్ లో అప్పట్లో జరిగిన అటల్ బిహారీ వాజ్ పేయి గారి సభకు తనవంతుగా జగిత్యాల ప్రాంతం నుంచి 50 బస్సుల ద్వారా పేద ప్రజలను, యువకులను సంఘటితం చేసి ఆ మీటింగ్ ని సక్సెస్  చేసిన వ్యక్తి జితేందర్ రెడ్డి.నక్సలైట్స్ తో  తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా వెన్న చూపని ధీరుడు జితేందర్ రెడ్డి. ఆయన ఒంట్లో 72 బుల్లెట్స్ ను దింపి నక్సలైట్స్ దారుణంగా హత్య చేశారు. హింస ద్వారా ఏం సాధించలేరనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేసారు.

ఇప్పటికీ ఉగ్రవాదులు, నక్సలైట్స్  తుపాకుల ద్వారా హింస ద్వారా అనుకున్నది సాధించవచ్చు అనుకోవడం తప్పుడు ఆలోచన అన్నారు.  జితేందర్ రెడ్డి తండ్రిగారైన ముదిగంటి మల్లారెడ్డి గారు సాత్విక స్వభావులు. తన కుమారుడు పోరాటంలో చనిపోతాడు అని తెలిసి కూడా ఆయన ఎక్కడా అడ్డుకోకుండా ప్రజల కోసం తన ఇంట్లో వ్యక్తిని జాతీకి అంకితం చేసిన వ్యక్తి.

ఈ రోజున  రవీందర్ రెడ్డిగారు తన సోదరుడైన జితేందర్ రెడ్డి యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాలి అనుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం గొప్ప విషయం అన్నారు.  ముఖ్యంగా రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని ఇంత చక్కగా దర్శకత్వం వహించినటువంటి విధించే వర్మ కు నా అభినందనలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది అని చెప్పడం జరిగింది. కాబట్టి నక్సలైట్లు నక్సలిజం వదిలిపెట్టి ప్రజాస్వామ్యం వైపు రావాలని కోరారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link