Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్ స్కీమ్ వద్దంటూ ఉద్యోగసంఘాల వ్యతిరేకత.. అసలు కారణం ఇదే..!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)లో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై ఉద్యోగ సంఘాలు సంతృప్తికరంగా లేదు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవంటూ నొక్కి చెబుతున్నాయి. అందుకే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS) స్పష్టం చేసింది.
ఎక్స్ వేదికగా ఉద్యోగ సంఘాలు అది తమ హక్కు అని దీనికోసం పోరాడుతూనే ఉంటామని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం తీసుకువచ్చిన ఈ కొత్త పథకం ద్వారా ఉద్యోగులు నిర్ణీత మొత్తంలో పెన్షన్ కు హామీ ఇచ్చే పథకం. ఈ పథకం కింద గత 12 ఏళ్లుగా ఉద్యోగి పొందిన జీతం ఆధారంగా పెన్షన్ అమలు చేస్తారు. ఇందులో 60 శాతం హామీతో కూడిన పెన్షన్ కూడా ఉంది.
ఉద్యోగి మరణించిన వెంటనే ఈ పెన్షన్ కుటుంబ సభ్యులకు అందజేస్తారు. అయితే, ఇది కేవలం పదేళ్ల పనిచేసి పదవీ విరమణ చేసినవారికే వర్తిస్తుంది. కనీసం నెలకు రూ.10 వేలు హామీతో కూడిన పెన్షన్ పొందుతారు. 2004 ఎన్‌పీఎప్ కింద ఉద్యోగ విరమణ పొందినవారికి ఈ పెన్షన్ ఇప్పటికే వర్తిస్తుంది.
2025 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. అయితే, అదే ఏడాది మార్చి 31 వరకు పదవీ విరమణ పొందిన వారు కూడా అర్హులు యూపీఎస్‌లోని ఐదు ప్రయోజనాలకు కూడా వారు అర్హులవుతారు. అయితే, ఈ పథకంలో కచ్చితంగా చేరాలని కేంద్రం నిబంధన పెట్టలేదు. ఎన్‌పీఎస్‌లో కొనసాగేవారు అలాగే కొనసాగవచ్చు.
అయితే, యూపీఎస్‌లో చేరాలనుకునే ఉద్యోగుల కోసం ఫారమ్ 6A ను నేడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్పేర్ విడుదల చేయనుంది. ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందే ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫారమ్‌లో 9 ఫారమ్‌లు కూడా విలీనం చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ తెలిపారు.