SOP For Movie Shootings: సినిమా షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా, టీవీ షూటింగ్ తిరిగి ప్రారంభం (Resumption of films and TV serials shooting) కానున్నాయి. షూటింగ్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ (Prakash Javadekar) ఆదివారం ఓ ప్రకటనలో ఈ విషయాలు తెలిపారు. సోషల్ డిస్టాన్సింగ్, శానిటైజన్, మాస్కులు ధరించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ.. ఈ కింది మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు.
నటీనటులు, టెక్నీషియన్లు మాస్కులు ధరించాలి. ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించాలి. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి
(Image: Prakash Javadekar Twitter)
ఎడిటింగ్ రూములు, రికార్డింగ్ థియేటర్లలో 6 అడుగుల వరకు భౌతిక దూరం (Social Distancing) పాటించాలి. సాధ్యమైనంత తక్కువ మంది నటీనటులు, సిబ్బందితో షూటింగ్స్ జరపాలి. కచ్చితమైన ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్స్ (లోపలికి, బయటకు వెళ్లేందుకు) ఏర్పాటు చేయాలి. గ్లోవ్స్, మాస్కులు, పీపీఈ కిట్లు షూటింగ్ ప్రాంతంలో వినియోగించాలి.
(Image: Prakash Javadekar Twitter)
(Image: Prakash Javadekar Twitter)