Chaiwala Nagpur Net Worth: టీ కొట్టు కోటీశ్వరుడు.. నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? దిమ్మతిరిగిపోద్ది..
ఛాయ్ వాలా అంటే గుర్తుకొచ్చేది ఒక్కటే ఒక్కడు.. అతడే నాగ్‌పూర్ డాలీ.. ఆయన పేరు గురించి అందరకీ పెద్దగా చెప్పనక్కర్లే.. అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యక్తుల్లో ఇతను ఒకరు.
డాలీ గత కొన్ని సంవత్సరాలుగా నాగ్‌పూర్‌లో చిన్న టీ షాప్ నడుపుతున్నాడు. అయితే ఆయన టీ చేసే సమయంలో వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఇలా ప్రతి రోజు వీడియో పోస్ట్ చేసేవాడు.
ప్రతి రోజు పోస్ట్ చేసిన వీడియోలకు లక్షలాది వ్యూస్ వచ్చేవి.. అంతేకాకుండా అతి కొద్ది కాలంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నవారు.. అలాగే యూట్యూబ్‌లో 14 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ పొందాడు.
అలాగే కొన్ని నెలల కిందట ఈ ఛాయ్‌వాలా షాప్‌ను బిల్ గేట్స్ కూడా సందర్శించారు. అప్పుడు ఛాయ్‌వాలా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయాగా ఆయన మరింత వైరల్ అయ్యారు. అప్పటి నుంచి డాలీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగింది.
డాలీ ప్రతి రోజు దాదాపు 480 నుంచి 500 కప్పులకు పైగా టీలను విక్రయిస్తారట.. దీంతో పాటు ప్రతి వారానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తారని సమాచారం.. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు.
ఇక ఛాయ్‌వాలా ప్రతి నెల ఆదాయం విషయానికొస్తే.. ప్రతి నెల రూ.1,20,000పైగా సంపాదిస్తున్న తెలుస్తోంది. అంతేకాకుండా ఛాయ్‌వాలా ఇతర సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.