Chandra Grahan on Holi 2024: వందేళ్లకు హోలీ నాడు చంద్ర గ్రహణం, ఆ 5 రాశులకు తీవ్రనష్టం

Tue, 19 Mar 2024-5:51 pm,

మీన రాశి

మీన రాశి జాతకులకు చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. వ్యాపారానికి ఇది మంచి సమయం కాదు. కుటుంబంలో గొడవలు జరగవచ్చు. 

కుంభ రాశి

ఈ రాశి జాతకులకు కూడా సమస్యలు, కష్టాలు తప్పవు. జీవిత భాగస్వామితో కూడా ఇబ్బందులు ఎదురౌతాయి. గొడవలు జరుగుతాయి. వ్యాపారంలో భారీ నష్టం సంభవించవచ్చు. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

కన్యా రాశి

చంద్ర గ్రహణం ఇదే రాశిలో ఏర్పడనుండటంతో చాలా అశుభంగా భావిస్తారు. కన్యా రాశి జాతకుల కెరీర్, వ్యాపారం రెండింటికీ నష్టం చేకూరుతుంది. ఆత్మ విశ్వాసం కోల్పోతుంటారు. కుటుంబంలో గొడవలు జరగవచ్చు. ఆరోగ్యం వికటించే ప్రమాదముంది. ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురు కావచ్చు.

వృషభ రాశి

2024లో ఏర్పడనున్న తొలి చంద్ర గ్రహణం ప్రభావం కన్యా రాశిలో ఉంటుంది. దాంతో వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశముంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత అంశాల్లో సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చేయడం మంచిది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురౌతాయి

మేష రాశి

హోలీ రోజున ఈ రాశి వారి జీవితాల్లో ఆటంకాలు పెరగనున్నాయి. కెరీర్ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. జీవితంలో సమస్యలు పెరగవచ్చు. డబ్బులు నష్టపోయే అవకాశముంది. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. 

ఫాల్గుణ మాసంలో పౌర్ణిమ రోజున మార్చ్ 25వ తేదీన హోలీ పర్వదినం అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు. ఈ ఏడాదిలో ఇదే తొలి చంద్ర గ్రహణం. మార్చ్ 25వ తేదీ ఉదయం 10 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై మద్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు పూర్తవుతుంది. గ్రహణంతో పాటు కొన్ని అశుభ యోగాలు ఏర్పడనున్నాయి. మీన రాశిలో సూర్యుడు, రాహువుల అశుభ కలయిక ఉంటుంది. కుంభ రాశిలో మంగళ-శని గ్రహాల భయంకర కలయిక ఉంటుంది. ఇలా మొత్తం 5 రాశులవారికి తీరని హాని కలగవచ్చు. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు జ్యోతిష్య పండితులు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link