Amrapali Kata: ఆమ్రపాలీకి బంపర్ బొనాంజా.. కీలక శాఖను కేటాయించిన ఏపీ సర్కారు.. మిగతా ఐఏఎస్‌లకు కూడా పోస్టింగ్..
తెలంగాణ నుంచి అనేక నాటకీయ పరిణామల మధ్య ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఏపీకి వెళ్లి అక్కడ రిపోర్టు చేశారు. ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల నుంచి వీరికి ఏపీ సర్కారు ఎలాంటి శాఖలను కేటాయించలేదు.
దీంతో మళ్లీ వీళ్లు తెలంగాణకు వస్తారని కూడా జోరుగా ప్రచారం సైతం జరిగింది,.ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులు మాట్లాడుకుని,, మళ్లీ తెలంగాణకు కొంతమంది ఐఏఎస్ లను వెనక్కు పిలిపించుకుంటారని వార్తలు వచ్చాయి.
అందుకే ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేసి చాలా రోజులు గడుస్తున్న అందుకే ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పకుండా హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేేపథ్యంలో ఆమ్రపాలీ విషయంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు.. దీపావళికి ముందు సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తొంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి ఐఏఎస్ లకు కీలక శాఖలు కేటాయిస్తు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలీ ఏపీ టూరిజం వీసీఎండీగా, టూరిజం అథారిటీ సీఈవో గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. వైద్యారోగ్య శాఖ కమిషనర్ గా వాకాటి కరుణ , జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
అదేవిధంగా.. జేఏడీలో పురావాస్తు, మ్యూజీయం శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్ కు బాధ్యతలు అప్పగించారు. కానీ రోనాల్డ్ రాస్ కు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తొంది.