Tirumala: తెలంగాణ నేతలకు భారీ శుభవార్త.. శ్రీవారి దర్శనం సిఫారులపై చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం.. డిటెయిల్స్..
తిరుమల శ్రీవారిని భక్తుు కొంగు బంగారంగా భావిస్తారు. అదే విధంగా ఎంతోదూరం నుంచి వచ్చి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో ఎన్నిగంటలైన వేచీ చూస్తుంటారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరచుగా శ్రీవారి దర్శనం కోసం భక్తులకు అనేక సిఫారసుల లేఖలు ఇస్తుంటారు. దీంతో స్వామి వారి దర్శనం కాస్త తొందరగా అవుతుందని చెప్పుకొవచ్చు.
ఈ క్రమంలో ఈ రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల దర్శనంపై పలు అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తొంది.
దీనిలో ముఖ్యంగా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వారానికి రెండు సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం అంగీకారం తెలిపినట్లు తెలుస్తొంది.
అదే విధంగా వీక్లీ.. రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు అనుమతిని ఇచ్చినట్లు తెలుస్తొంది.
అంటే మొత్తంగా రెండు లేఖలు బ్రేక్ దర్శనం మరో రెండు మూడు వందల రూపాయల టికెట్ల మీద ప్రజాప్రతినిధులు సిఫారసులు ఇవ్వొచ్చని తెలుస్తొంది. ఈమేరకు ఏపీ సర్కారు, టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.