Chandrababu Sarees: భార్యకు ప్రేమతో.. స్వయంగా చీరలు కొన్న సీఎం చంద్రబాబు
Chandrababu Sarees Buys:తన సతీమణి భువనేశ్వరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీరలు కొనుగోలు చేశారు. స్వయంగా చీరలు పరిశీలించి ఏరికోరి కొన్నారు.
Chandrababu Sarees Buys: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాలలో బుధవారం ఓ కార్యక్రమం నిర్వహించారు.
Chandrababu Sarees Buys: వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులతో చేనేత వస్త్రాల ప్రదర్శన చేపట్టారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు అందరినీ ఆకట్టుకున్నాయి.
Chandrababu Sarees Buys: స్టాళ్లను పరిశీలిస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు రెండు స్టాళ్లలో చీరలు కొన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు చీరలు కొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొన్న చీరలకు స్వయంగా డబ్బులు ఇచ్చారు. కొన్న చీరల్లో ఉప్పాడ, వెంకటగిరి చీరలు ఉండడం విశేషం.
Chandrababu Sarees Buys: 'త్రిఫ్ట్ ఫండ్, నూలు రాయితీ, జీఎస్టీ భారం, రిబేట్, సొసైటీలకు పావలా వడ్డీ రుణాలు' వంటి చేనేత సమస్యలను ఈ సందర్భంగా చంద్రబాబు విన్నారు.
Chandrababu Sarees Buys: 'గ్రూపుగా మగ్గం పెట్టుకోవటానికి స్థలం ఇస్తాం. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గాలు ఏర్పాటు చేసుకోవటానికి రూ.4.30 లక్షలకు అదనంగా మరో రూ.50 వేలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం' అని సభలో చేనేత కార్మికులకు చంద్రబాబు వరాలు ప్రకటించారు.
Chandrababu Sarees Buys: 'చేనేతలను ఆదుకుంటాం. 97 వేల మంది నేతన్నలకు రూ.4 వేల పింఛన్ ఇస్తున్నాం. స్కిల్ డిజైన్ నేర్పించి, ఆదాయం పెంచే విధానం తీసుకుని వస్తాం. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కోసం రూ.10 కోట్లు, పొదుపు నిధిలో త్రిఫ్ట్ ఫండ్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 16 శాతానికి పెంచుతాం, రూ.70 కోట్ల వరకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం' అని చేనేత వర్గానికి చంద్రబాబు హామీ ఇచ్చారు.