Chandrababu Temple Tour: చంద్రబాబు ఆలయాల యాత్ర.. తిరుమల, ఇంద్రకీలాద్రి సందర్శన

Thu, 13 Jun 2024-9:50 pm,

Chandrababu Temple Tour: అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు ఆలయాల సందర్శన చేపట్టారు.  

Chandrababu Temple Tour: ప్రమాణస్వీకారం చేసిన బుధవారం రోజే తిరుమలకు చంద్రబాబు కుటుంబంతో సహా చేరుకున్నారు.  

Chandrababu Temple Tour: తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  

Chandrababu Temple Tour: శ్రీవారిని నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మాణి, నారా దేవాన్ష్‌తో కలిసి దర్శించుకున్నారు.

Chandrababu Temple Tour: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దగ్గరుండి ముఖ్యమంత్రి కుటుంబానికి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు.

Chandrababu Temple Tour: దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న భక్తులతో మాట్లాడి సెల్ఫీలు, ఫొటోలు దిగారు.  

Chandrababu Temple Tour: తిరుమల పర్యటనలో చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.  

Chandrababu Temple Tour: అక్కడే కొద్దిసేపు విలేకరులతో చంద్రబాబు మాట్లాడారు. తిరుమలను ప్రక్షాళన చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

Chandrababu Temple Tour: అక్కడి నుంచి విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని చంద్రబాబు కుటుంబంతో సహా దర్శనం చేసుకున్నారు.

Chandrababu Temple Tour: ఇంద్రకీలాద్రిపై ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link