CBN PSPK Meet: జమిలి ఎన్నికల బిల్లు వేళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏం జరగనుంది?
మరోసారి భేటీ: అధికారంలోకి ఆరు నెలలు గడిచిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.
సచివాలయంలో: అమరావతిలోని సచివాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. వీరి వెంట అధికారులు కూడా ఉన్నారు.
శాఖలపై చర్చ: పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
నివేదన: ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ తన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై చంద్రబాబుకు నివేదించినట్లు సమాచారం.
రాజకీయాలు: ఆంధ్రప్రదేశ్‌లో, జాతీయంగా రాజకీయ పరిణామాలు మారుతున్న దశలో వీరిద్దరూ భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్ పరిణామాలు: జమిలి ఎన్నికలు రానుండడంతోపాటు భవిష్యత్ రాజకీయ కార్యక్రమాలపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది.