Chandrababu: నిద్రపోని చంద్రుడు.. అర్ధరాత్రి సహాయ చర్యల్లో సీఎం చంద్రబాబు

Chandrababu Rescue Operations: భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో విజయవాడ జలదిగ్బంధమైన విషయం తెలిసిందే. వర్షాలపై ఆదివారం రోజంతా సీఎం చంద్రబాబు సమీక్షలు జరిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసి సహాయ చర్యలకు ఉపక్రమించారు.

Chandrababu Rescue Operations: ఈ క్రమంలోనే విజయవాడలో తీవ్రంగా ప్రభావితమైన సింగ్‍నగర్‌లో సీఎం చంద్రబాబు స్వయంగా పర్యటించారు.

Chandrababu Rescue Operations: బోటుపై వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Chandrababu Rescue Operations: ప్రజలకు ఆహారం, బిస్కెట్లు, నీళ్ల సీసాలు తదితర చంద్రబాబు స్వయంగా అందించారు.
Chandrababu Rescue Operations: సందర్శిస్తున్న క్రమంలో ప్రజలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మీకు నేనున్నా అని అర్ధరాత్రి భరోసా ఇచ్చారు.
Chandrababu Rescue Operations: విజయవాడలోని కృష్ణలంకలో కూడా సీఎం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
Chandrababu Rescue Operations: అర్ధరాత్రి అధికారులతో కలిసి చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం ఇచ్చారు.
Chandrababu Rescue Operations: వరద తీవ్రతపై కంటి మీద కునుకు లేకుండా చంద్రబాబు సహాయ చర్యల్లో మునిగారు.