Amaravati: ఆంధ్రుల రాజధాని అమరావతి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

Thu, 20 Jun 2024-11:04 pm,

Amaravati: తెలంగాణ రాష్ట్ర విభజనతో 2014లో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండాపోయింది. నాడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాజధాని కోసం తీవ్రంగా అన్వేషించారు.

Amaravati: చాలా ప్రాంతాలు పరిశీలించిన తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర ప్రాంతాలను కలిపి రాజధానిగా ప్రకటించారు.  

Amaravati: 22 అక్టోబర్‌ 2015 నాడు దసరా పండుగ రోజు అమరావతి రాజధాని నిర్మాణానిక శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తదితరులు హాజరయ్యారు.

Amaravati: 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే అమరావతి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి మూడు రాజధానులు అంటూ సరికొత్త ప్రతిపాదన చేశారు.

Amaravati: ఇక అప్పటి నుంచి రాజధాని అమరావతి నిర్మాణం మూలకు చేరింది. నాడు శంకుస్థాపన చేసిన రాజధాని ప్రాంతం కంపచెట్లతో నిండి ఒక అడవిని తలపిస్తోంది.

Amaravati: ఎన్నో ప్రణాళికలతో నిర్మించిన భవనాలు పాడుబడ్డాయి. నిర్మాణ సామగ్రి, పైపులైన్లు, ఇనుము తదితర వస్తువులు దొంగతనానికి గురయ్యాయి.

Amaravati: రాజధానిగా అమరావతి కొనసాగాలని రాజధాని ప్రాంత రైతులు 1600 రోజులు సుదీర్ఘ ఉద్యమం నడిపారు.

Amaravati: నాడు అంకురార్పణ చేసిన చంద్రబాబు నేడు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో అమరావతి ఊపిరి పీల్చుకుంది.  

Amaravati: రాజధాని ప్రాంత పరిశీలనకు చంద్రబాబు వెళ్లిన సమయంలో అక్కడి పరిస్థితులు దయనీయంగా మారాయి.  

Amaravati: వాటిని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదన చెందారు. రాజధాని కావాల్సిన ప్రాంతం ఎలా తయారయ్యిందనోనని బాధపడ్డారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link