Crying Benefits: ఏడుపుతో ప్రయోజనాలేంటో తెలుసా, గుండె జబ్బులు దరి చేరవట

Mon, 11 Oct 2021-2:02 pm,

కన్నీళ్ల కారణంగా చెడు ఆలోచనలు దూరమవడమే కాకుండా మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్ ఆలోచనలవైపు దృష్టి మరలుతుంది. మూడు రకాల కన్నీళ్లు కూడా మేలు కల్గిస్తాయి.

ఎక్కువగా ఏడ్వటం ద్వారా కంటికి కూడా చాలా ప్రయోజనాలున్నాయి. కళ్లల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకు పోతాయి. కన్నీటిలో ఉండే ఐసోజైమ్స్..క్రిములు, బ్యాక్టీరియా నుంచి కంటికి రక్షణ కల్పిస్తాయి.

ఏడ్వడం వల్ల మెదడు, శరీర ఉష్ణోగ్రతలు సంతులితంగా ఉండి..సమన్వయంతో ఆలోచించగలుగుతాం. అప్పుడప్పుడూ ఏడ్వడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు.

ఏదైనా విషయం గురించి బాధపడుతూ ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్పిన్ అనే ఫీల్‌గుడ్ రసాయనాలు విడుదలై శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు కలుగుతాయి. ఫలితంగా శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది.

సాంకేతికత అభివృద్ది చెందే కొద్దీ అంతేవేగంగా అందిపుచ్చుకునేందుకు మనిషి ప్రయత్నాలు తీవ్రంగా ఉన్నాయి. ఫలితంగా నిత్య జీవితంలో చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో మనిషి ఆరోగ్యం కోసం నవ్వు ఎంత ముఖ్యమో..ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link