Almond Milk and Health Tips: బాదం పాలు పరిమితి దాటితే ఏమౌతుంది, ఏ సమస్యలు తలెత్తుతాయి
బాదం పాలు పిల్లలకు కూడా అంత మేలు చేసేది కానే కాదు. పిల్లలకు అవసరమైన పోషకాలు ఇందులో ఉంతగా ఉండవు. బాదం పాలు ఎప్పటికీ తల్లిపాలకు ప్రత్యామ్నాయం కావనే సంగతి గుర్తుంచుకోవాలి.
బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు. అంటే థైరాయిడ్ సమస్యకు బాదం పాలు కారణమవుతాయి. బాదం పాలను పరిమితికి మించి తీసుకుంటే థైరాయిడ్‌కు హాని కల్గించే రసాయనాలు విడుదలయ్యేందుకు కారణమవుతాయి.
ఆవుపాలలో కంటే బాదం పాలలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ సమస్య ఉన్నవారు మితంగా తీసుకోవాలి.
నట్స్ అలర్జీ ఉన్నవారు బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది. లాక్టోస్ అలర్జీ ఉన్నవారు కూడా బాదం పాలకు దూరంగా ఉంటే మంచిది.
బాదం అధికంగా తీసుకుంటే..ఇందులో ఉండే మినరల్స్, న్యూట్రియంట్స్ అవసరానికి మించితే వాంతులు రావడం, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, పేగు అనారోగ్యం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే మితంగా తీసుకోవడం మంచిది.