Photo Story: ఐపిఎల్ లో అదరగొట్టే భారతీయ క్రీడాకారులు వీళ్లే

Wed, 12 Aug 2020-12:06 pm,

భారత వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రాబిన్ ఉతప్ప ఐపిఎల్ సీజన్ 13లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. 177 మ్యాచుల్లో 4,411 పరుగులు సాధించాడు. యావరేజ్ 28.83 కాగా.. స్ట్రైక్ రేటు 130.50 . ఇందులో 24 ఫిస్టీస్ ఉన్నాయి. 

ముంబై ఇండియన్ బ్యాట్స్ మెన్ .. భారతీయ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ..ఇప్పటి వరకు నాలుగు ఐపీఎల్ టైటిల్ సాధించిన టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రోహిత్ వేగవంతం అయిన ఆటకు చాలా మంది ఫ్యాన్ అయ్యారు. మొత్తం 188 మ్యాచుల్లో 4898 పరుగులు సాధించాడు. యావరేజ్ 31.60 కాగా స్ట్రైక్ రేటు 130.32. ఒక సెంచరీ 36 అర్థ సెంచరీలు చేశాడు.

మిస్టర్ ఐపిఎల్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే సురేష్ రైనా లీగ్ లోనే అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లో ఒకరు.  చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడే సురేష్ రైనా 2008 నుంచి ప్రతీ ఐపిఎల్ సీజన్ లో 400 పరుగుల కన్నా ఎక్కువ రన్స్ చేశాడు. 193 మ్యాచుల్లో మొత్తం 5,368 పరుగులు సాధించాడు. యావరేజ్ 33.34 కాగా స్ట్రైక్ రేటు 137.14. రైనా ఒక సెంచరీ స్కోర్ చేయగా.. ఇందులో 38 ఫిఫ్టీస్ ఉన్నాయి. బౌలింగ్ లో 25 వికెట్లు కూడా సాధించాడు.  

భారత వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రాబిన్ ఉతప్ప ఐపిఎల్ సీజన్ 13లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. 177 మ్యాచుల్లో 4,411 పరుగులు సాధించాడు. యావరేజ్ 28.83 కాగా.. స్ట్రైక్ రేటు 130.50 . ఇందులో 24 ఫిస్టీస్ ఉన్నాయి. 

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ పేరు ఈ లిస్ట్ లో తప్పకుండా ఉండాల్సిందే. ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్లకు దడ. మొత్తం 190 మ్యాచుట్లో 4.432 పరుగులు సాధించిన ధోనీ యావరేజ్ 42.20 కాగా స్ట్రైక్ రేటు 137.85. ధోని అత్యుత్తమ స్కోరు 84 పరుగులు కాగా.. మొత్తం 23 ఫిఫ్టీస్ సాధించాడు.

టీమ్ ఇండియాలో అజింక్య రహానే కీలక ఆటగాడు. సైలెంట్ గా కనిపించే రహానే తన బ్యాటింగ్ లో దూకుడు చూపిస్తాడు.  140 ఐపీఎల్  మ్యాచుల్లో 3820 పరుగులు సాధించిన రహానే యావరేజ్ 32.93 కాగా.. స్ట్రైక్ఖ రేటు 121.92. ఇందులో రెండు సెంచరీలు, 27 అర్థ సెంచరీలు ఉన్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link