Chennai Super Kings: మెగా వేలానికి ముందు ఈ ఆటగాళ్లకు చెన్నై సూపర్ కింగ్స్ టాటా.. ఎందుకంటే..?

Sat, 25 May 2024-3:56 pm,

ప్రతి మూడేళ్లకు ఒకసారి మెగా వేలం, ప్రతి ఏడాది మినీ వేలం నిర్వహిస్తారు. అందుకు తగినట్లు ఆయా జట్ల యజమాన్యాలు తమ ఆటగాళ్లను మార్చుకుంటున్నాయి.  

బిడ్డింగ్‌కు ముందే అన్ని జట్లు తాము వద్దనుకున్న ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేస్తాయి.  

2022 మెగా వేలానికి ముందు ప్రతి జట్టుకు నలుగురు ప్లేయర్లను కొనసాగించుకునే అవకాశం ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కీలక ఆటగాళ్లను వదులుకునే అవకాశం ఉంది.   

దీపక్ చాహర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. గత వేలంలో సీఎస్‌కే రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. పవర్ ప్లేలో మాత్రమే స్పెషలిస్ట్ కాగా.. డెత్ ఓవర్లలో చాహర్ తేలిపోతున్నాడు. దీనికి తోడు తరచూ గాయాలపాలవ్వడంతో టీమ్‌కు ఇబ్బందిగా మారుతోంది.    

డారిల్ మిచెల్‌ను కూడా చెన్నై రిలీజ్ చేసే అవకాశం ఉంది. మినీ వేలంలో రూ.14 కోట్లు చెల్లించింది. మెగా వేలంలో తక్కువ ధరకు తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నించవచ్చు.   

2022 మెగా వేలానికి ముందు శార్దుల్ ఠాకూర్‌ను రిలీజ్ చేసిన సీఎస్‌కే.. 2024 మినీ వేలంలో రూ.4 కోట్లకు తిరిగి తీసుకుంది. అయితే బౌలింగ్‌, బ్యాటింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపంచలేకపోవడంతో జట్టు నుంచి విడుదల చేసే ఛాన్స్ ఉంది.   

చెన్నై సూపర్ కింగ్స్ 2021, 2023లో ఛాంపియన్‌గా నిలవడంలో మొయిన్ అలీ కీరోల్ ప్లే చేశాడు. అయితే ఈ సీజన్‌లో ఆశించినస్థాయిలో ఆడలేదు. మెగా వేలానికి ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంది.   

సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానేను 2023 ఐపీఎల్ సీజన్‌కు ముందు సీఎస్‌కే తీసుకుంది. గత సీజన్‌లో అదరగొట్టిన రహానే.. ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈసారి జట్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link