Chilkur Balaji: వెయ్యిరెట్లు భక్తులు ఎక్కువగా వచ్చారు.. గరుడ ప్రసాదంపై క్లారీటీ ఇచ్చిన ఆలయ పూజరీ..

Sat, 20 Apr 2024-7:27 am,

హైదరాబాద్ శివారులో మొయినా బాద్ పరిధిలో చిలుకురు బాలాజీ ఎన్నో ఏళ్లుగా భక్తులు పూజలందుకుంటున్నారు. ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ప్రతిరోజు ఇక్కడకు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు బారులు తీరుతుంటారు.   

చిలుకూరును చాలా మంది చిన్నతిరుపతిగా భావిస్తారు. ఇక్కడకు వచ్చి దండంపెట్టుకుని వెళ్తే ఏపనైన నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. చిలుకూరు బాలాజీ భక్తులకు కొంగుబంగారంగా మారాడని కూడా చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటు ఉంటారు. చిలుకూరులో ముఖ్యంగా ప్రదక్షిణల గురించి విశేషంగా చెప్పుకొవచ్చు.

ఇక్కడ భక్తులు వచ్చి తొలుతస్వామి వారిని పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటారు. తమ మొక్కులు తీరాక మరల వచ్చి 111 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ఆ స్వామి వారికి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ ఇతర ఆలయాల మాదిరిగా హుండీలు మాత్రం అస్సలు కన్పించవు. భక్తులు స్వామి వారి సేవలో సెక్యురిటీలుగా ఉంటారు.   

ఇదిలా ఉండగా ఏటా చిలుకూరులో చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనిలో ముఖ్యంగా సంతాన భాగ్యంలేని మహిళలకు గరుడ ముద్దలను ప్రసాదంగా ఇస్తారు. దీని గురించి ఆలయ ప్రధాన అర్చకులు వివరంగా చెప్పారు. దీంతో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. నిన్న (శుక్రవారం) ఏకాదశిని పునస్కరించుకుని లడ్డు ప్రసాదం పంపిణి చేస్తున్నట్లు, మూడు రోజులు ప్రసాదం ఇస్తారని ప్రచారం జరిగింది.  

కానీ చిలుకురు ఆలయ పూజారులకు, పోలీసులకు ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఎదురైంది. ఆలయ సిబ్బంది భావించిన దాని కన్న కూడా వెయ్యిరెట్టు భక్తులు ఆలయంకు క్యూ కట్టారు. దీంతో పదికిలో మీటర్ల మేర పూర్తిగా రోడ్లన్ని ఎక్కడిక్కడ బ్లాక్ అయిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి, గంటల కొద్ది కష్టపడి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కనీసం అంబులెన్స్ లు, పోలీసులు వాహానం కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.   

దీంతో ఆలయ పూజారీ రంగరాజన్ కీలక ప్రకటన చేశారు. తాము గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్లు తెలిపారు. అంతేకాకుండా..శని, ఆదివారం రోజుల్లో కూడా ప్రసాదం ఇవ్వడంలేదంటూ ప్రకటించారు. తాము అనుకున్న దాని కంటే కూడా వెయ్యిరెట్లు భక్తులు తరలి వచ్చారని పూజారీ రంగరాజన్ అన్నారు. భక్తులు అన్యధా భావించకుండా తమతో సహాకరించాలని కూడా ఆలయ పూజారీ రంగరాజన్ పేర్కొన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link