China New Rules: ఆ విదేశీ కంపెనీలు చైనాను ఎందుకు వదిలేశాయి
నవంబర్ 1 నుంచి చైనాలో పార్టనర్స్ ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చింది. చైనాలో పనిచేస్తున్న పశ్చిమ దేశాల కంపెనీలకు ఆ కొత్త చట్టం ఆందోళనకరంగా ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలే ఇందుకు కారణంగా ఉంది.
Fortnite వీడియో గేమ్ కూడా నవంబర్ 15 నుంచి చైనా మార్కెట్ నుంచి బయటికొచ్చేస్తున్నట్టు తెలిపింది. ఈ గేమ్ చైనాలోని అతిపెద్ద గేమింగ్ కంపెనీ Tencentతో కలిసి లాంచ్ చేసింది.
లింక్డ్‌ఇన్ కూడా తమ వెబ్‌సైట్ చైనా వెర్షన్‌ను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ లేని వెబ్‌సైట్‌గా మార్చనుంది.
యాహూ కూడా ఇటీవలే తన సేవల్ని చైనాలో నిలిపివేసింది. ఎందుకంటే చైనాలో సవాళ్లతో కూడిన వ్యాపారం వేగంగా విస్తరిస్తున్నందున ఇక్కడి సేవల్ని నిలిపివేయక తప్పలేదు.
చైనా గ్రేట్ ఫైర్‌వాల్‌గా పిలవబడుతోంది. సెన్సార్‌షిప్ కోసం చట్టాన్ని, సాంకేతికతను బాగా ఉపయోగించుకుంటుంది ఆ దేశం. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు చైనాలో నిషేధించబడ్డాయి. ప్రభుత్వ పర్యవేక్షణ, ఒత్తిడి కారణంగా ఈ కంపెనీలు చాలా పోస్టులు డిలీట్ చేశాయి. కొన్ని పోస్టుల్లో వ్యాఖ్యలు తొలగించబడ్డాయి.