Chiranjeevi: వావ్.. ఊటీలో ఇంద్రభవనంలాంటి ప్రాపర్టీ కొన్న చిరంజీవి.. అన్ని కోట్లు పెట్టడం వెనుక కారణం అదేనట..
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సైతం పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆయన.. అనేక కొన్నిరోజులుగా అత్యంత విలాస వంతమైన ప్రాపర్టీలను కొనుగులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితం ఆయన.. బెంగళూరులో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో ఈ ఫామ్ హౌస్ గురించిన వార్తలలో నిలిచారు. అది... బెంగళూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవనహళ్లి లో ఈ విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారని తెలుస్తోంది. దీని ఖరీదు అక్షరాలా రూ .35 లక్షలంట.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ కు.. ఇప్పటికే హైదరాబాద్, గోవా, విశాఖ పట్నం, చెన్నై వంటి ప్రధాన నగరాలలో సొంత ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆయన తాజాగా.. తమిళనాడులోని ఊటీ అవుట్ స్కర్ట్స్ లో ఓ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఊటీకి దగ్గరలో.. టీ గార్డెన్స్ మధ్య మంచి వ్యూ పాయింట్‌లో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాపర్టీని ఇటీవలే చిరంజీవి కొనుగోలు చేశారంట. తొలుత ఈ ప్రాపర్టీని రామ్ చరణ్, ఉపాసనలు చూసి వచ్చారంట. ఆ తర్వాత చిరుకూడా ఒకే చెప్పేసి కొనేశారంట.
ఈ ప్రాపర్టీ విలువ.. సుమారు రూ.16 కోట్లకు పైనే ఉంటుందని వినిపిస్తోంది. దానికి సంబంధించి రిజిస్టేషన్ వ్యవహరాలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి నివసిస్తున్న జూబ్లీహిల్స్ లోని బంగ్లా కూడా చాలా విలువైన ప్రాంతంలో చాలా విశాలంగా ఉన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా .. హాలిడే కోసం గోవా, ఊటీ లాంటి ప్రదేశాల్లోనూ ఆయన గృహాలను నిర్మించుకుని అక్కడ సరదాగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు గుస గుసలు విన్పిస్తున్నాయి
అయితే.. గోవా ప్రాపర్టీ దాదాపు సిద్ధమైందని, ఇది తన కుమారుడు రామ్ చరణ్ అభిరుచికి తగినట్లుగా నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఊటీ ప్రాపర్టీలో కూడా అనేక కొత్త ప్లాన్ లతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.