Chiranjeevi Vs Kamal Haasan: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
Chiranjeevi Vs Kamal Haasan: తెలుగు సినీ ఇండస్ట్రీలో అపుడపుడు కొంత మంది స్టార్ హీరోలు నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలైన సందర్బాలున్నాయి. అలాగే ఒకే హీరోయిన్ నటించిన చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడం అనేది చాలా రేర్ గా జరగుతూ ఉంటుంది. అలా దర్శకుడు ఏ.కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, కమల్ హాసన్ నటించిన చిత్రాలు ఒకే రోజు విడుదలై సంచలన విజయాలు సాధించాయి.
సాధారణంగా హీరోలు వేరే సందర్భాల్లో నటించిన చిత్రాలు .. కాస్త గ్యాప్ లో ఒకరోజు విడుదలైన సందర్బాలున్నాయి. కానీ ఒక దర్శకుడు ఇద్దరు అగ్ర హీరోలైన కమల్ హాసన్ తో పాటు చిరంజీవితో ఒకేసారి ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ ‘రాక్షసుడు’ సినిమాలను తెరకెక్కించి ఇద్దరు హీరోలకు బ్లాక్ బస్టర్స్ అందించాడు.
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’, కమల్ హాసన్ నటించిన ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ సినిమాలు 1986 అక్టోబర్ 2 న దసరా కానుకగా విడుదలైన సంచలన విజయాలు సాధించాయి.
రాక్షసుడు సినిమాలో చిరంజీవి సరసన సుహాసిని, రాధ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కే.యస్. రామారావు నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించారు.
మరోవైపు ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ సినిమాలో కమల్ హాసన్ సరసన శ్రీదేవి నటించింది. ఈ చిత్రానికి కూడా ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా కమల్ హాసన్ కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీగా నిలిచింది.
చిరంజీవి ..‘రాక్షసుడు’, కమల్ హాసన్..‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ సినిమాలకు యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలా ఆధారంగా తెరకెక్కించడం విశేషం.
చిరంజీవి, కమల్ హాసన్ విషయానికొస్తే.. వీళ్లిద్దరు కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇది కథ కాదు’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో చిరంజీవి విలన్ పాత్రలో నటించారు. తమిళంలో ఇదే పాత్రను రజినీకాంత్ చేసారు.
మరోవైపు చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాను తమిళంలో కమల్ హాసన్ తో బాలచందర్ ఒకేసారి తెరకెక్కించారు. మరోవైపు చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను తమిళంలో కమల్ హాసన్ ‘వసూల్ రాజా ఎంబీబీఎస్’ పేరుతో రీమేక్ చేశారు.
మొత్తంగా ఈ ఇద్దరు లెజెండ్స్ (కమల్ హాసన్, చిరంజీవి) ఒకరి సినిమాల్లో ఒకరు నటించడమే కాకుండా.. ఒక సినిమాలో నటించడంతో పాటు వీళ్ల సినిమాలు ఒకే రోజు విడుదల కావడం విశేషం.