Chiranjeevi: తమిళ హీరో, నిర్మాతపై చిరంజీవి ఒత్తిడి.. కొడుకు కోసం అలాంటి నిర్ణయం..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది తమ వారసులను నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .. అందులో ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమ వారసులను నిలబెట్టడానికి వారు పడే కష్టం.. ఎంతలా ఉంటుందో అందరికీ తెలుసు.
అంతేకాదు తమ వారసులకు ఎవరైనా పోటీగా వస్తే వారి ఎదుగుదలను ఆపేస్తారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఇప్పుడు.. మరో వార్త తెరపైకి రావడంతో మెగా ఫ్యామిలీ పై నెటిజన్స్ మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయంలోకెళితే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్లోనే.. విడుదల చేయాల్సి ఉండగా.. సంక్రాంతి రేస్ లో నిలపాలని చిరంజీవి మైత్రి మూవీ మేకర్స్ పై ఒత్తిడి తీసుకొచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి
ఈ నేపథ్యంలోనే తన చిత్రమైన.. విశ్వంభర సినిమాను మే నెలకు పోస్ట్ పోన్ చేసి, జనవరి 10వ తేదీన విశ్వంభర స్థానంలో గేమ్ ఛేంజర్ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేశారు చిరంజీవి. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాకి పోటీగా బాలకృష్ణ డాకు మహారాజ్ తో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ రేసులోకి అనూహ్యంగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రావడం గమనార్హం.
అజిత్ సినిమా అంటే సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. అందుకే చిరంజీవి కూడా ఈ సినిమాను విడుదల చేయకుండా మైత్రి మూవీ మేకర్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తమిళంలో గేమ్ ఛేంజర్ సినిమాను డైరెక్ట్ గా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయమని కూడా కోరుతున్నారు చిరంజీవి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా తమిళంలో గేమ్ ఛేంజర్ సినిమాకి ఏ హీరో సినిమా పోటీ లేకుండా విడుదలయ్యేలా ప్లాన్ చేయమని మైత్రి మూవీ మేకర్స్ పై చిరంజీవి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజము ఉందో తెలియాల్సి ఉంది.