Chiranjeevi vs Balakrishna: చిరంజీవి కంటే ఆ విషయం లో బాలయ్య బెటర్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్..!
తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడుగా పేరుపొందిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో నటించి.. వాటి ద్వారా సక్సెస్ అందుకొని ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు చిరంజీవి. ప్రస్తుతం వరుస చిత్రాలతో యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చిరంజీవి.
వాల్తేర్ వీరయ్య సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు చిరంజీవి. డైరెక్టర్ బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే డైరెక్టర్ బాబి అటు బాలయ్యతో ఇటు చిరంజీవితో సినిమాలు తెరకెక్కించారు. వీరిద్దరి మధ్య తేడాని కూడా తెలియజేశారు వాటి గురించి చూద్దాం.
వచ్చే ఏడాది జనవరి 12న బాలయ్యతో తెరకెక్కించిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ కథ ఎంపికల విషయంలో బాలయ్య చిరంజీవి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేశారు. చిరంజీవి గారికి మనం కథ చెప్పినప్పుడు ప్రతిసారి ఆయన ఎక్కువగా కథ గురించి అడుగుతూ ఉంటారని.. అలాగే డైలాగ్ పేపర్ కూడా తనకు ముందుగానే ఇచ్చేయాలని తెలియజేస్తారని తెలిపారు బాబి. ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారని వెల్లడించారు.
ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. బాలయ్య గారికి ఒకసారి కథ చెబితే చాలు మరొకసారి ఆయన కథ గురించి ఎప్పుడూ అడగరు. ఆయన గుడ్డిగా డైరెక్టర్లను మాత్రమే నమ్మేసి చేస్తూ ఉంటారని తెలిపారు.. సినిమా షూటింగ్ మొదలైంది అంటే చాలు డైరెక్టర్ ఏది చెబితే బాలయ్య అదే చేస్తారని తెలిపారు..
అలా డైరెక్టర్ బాబీ ఈ ఇద్దరు హీరోల.. గురించి చెప్పడంతో యాంటీ ఫ్యాన్స్ సైతం చిరంజీవి కథ విషయంలో ప్రతిసారి వేలు పెడతారని, ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు చెప్పారు. ఇప్పుడు మీరు కూడా ఇదే ఇండైరెక్టుగా చెప్పారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.