Cholesterol Control Tips: ధనియాలు, ఉసిరితో కూడా చెడు కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
బాడీలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా పెరిగితే అది ప్రాణాతకంగా మారే అవకాశాలున్నాయి. కావున ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి..కొన్ని సుగంధ ద్రవ్యాలను ఆహారంలో తీసుకోవాలి. ముఖ్యంగా శరీరానికి ఉపయోగపడే వాటిలో కొత్తిమీర గింజలు(ధనియాలు) ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఉసిరి, ధనియాలలో శరీరానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి పోషకాలుంటాయి. కావున శరీరంలో పెరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించి.. బరువును కూడా తగ్గిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
ధనియాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కావున శరీరానికి అన్ని రకాల పోషకాలను అందించడానికి సహాయపడతాయి. అయితే దీని కోసం చట్నీ, సలాడ్‌లో వీటిని వినియోస్తే మంచి ఫలితాలు పొందుతారు. అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఇవి ప్రాధాన పత్ర పోషిస్తాయి.
బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి మెంతులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో డయాబెటిస్‌ను నియంత్రించడానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. కావున శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి.. బరువును కూడా తగ్గిస్తాయి.
ఉసిరిలో ఉండే గుణాలు కూడా శరీరానికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా దీనిని వినియోగించవచ్చు.