Cholesterol Diet: శరీరంలో కొలెస్ట్రాల్ ను మంచులా కరిగించే మ్యాజిక్ ఫుడ్స్ ఇవే..
గుండె ధమనుల్లో పేరుకుపోయిన మురికిని పూర్తిగా శుభ్ర చేయడంలో ఆరోగ్యకరమైన ఆహారం సహాయపడుతుంది. వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
అవకాడో: అవకాడో నిజంగా ఒక అద్భుతమైన పండు. దీనిలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు, పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
చేపలు: సాల్మన్, మాకేరెల్ సార్డినెస్ వంటి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లకు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బాదం, వాల్‌నట్స్: డ్రై ఫ్రూట్స్ కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో మంచివి. ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతాయి.
పండ్లు: బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు వంటి బెర్రీలు అనేక విధాలుగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బెర్రీలు అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను నష్టం నుంచి రక్షిస్తాయి. ఇవి ముక్కు, గొంతు వాపు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
వెల్లుల్లి: వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే పదార్థం నిజంగానే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లిసిన్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల ధమనులు మూసుకుపోవడం వల్ల కలిగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలను
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లు అనే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ధమనులను శుభ్రంగా ఉంచుకోవడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.