Christmas Gifts: క్రిస్మస్ కానుక ఏం ఇవ్వాలనుకుంటున్నారు, మీ కోసం టాప్ 5 గిఫ్ట్స్ జాబితా
ఇక ఇది కూడా ఓ మంచి ప్రత్యామ్నాయమైన బహుమతి కాగలదు. ఒకేసారి ఎక్కువ డివైజ్‌కు పవర్ సరఫరా కావాలంటే..మల్టీప్లగ్ స్టాండ్ మంచి గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. దీని ధర 5 వందల రూపాయల కంటే తక్కువే.
ఇక మరో మంచి బహుమతి..పవర్ బ్యాంక్. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా మంది గిఫ్ట్ కాగలదు. క్రిస్మస్ కానుకగా ఇస్తే గుర్తుండిపోతుంది.
క్రిస్మస్ కానుకగా ఫోన్ ఆర్మ్‌స్టాండ్ కూడా బాగుంటుంది. ఇది కూడా మీకు 5 వందల రూపాయలకు దిగువనే లభించగలదు.
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ బాగా ఉంది. ఈ నేపధ్యంలో మీకు కావల్సినవారికి క్రిస్మస్ కానుకగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్మీ హాట్‌స్టార్ లేదా జీ5 వంటి ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ కానుకగా ఇవ్వవచ్చు. ఇందులో 5 వందల రూపాయల్నించి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం అంత వర్క్ ఫ్రం హోం నడుస్తోంది. ఈ క్రమంలో ల్యాప్‌టాప్ స్టాండ్ క్రిస్మస్ కానుకగా ఇస్తే ప్రయోజనముంటుంది. ఇది మీకు కేవలం 5 వందల రూపాయలకు లోపునే లభించగలదు.