Chunky Panday: బంగ్లాదేశ్ సూపర్ స్టార్‌కు.. విజయ్ దేవరకొండకు ఉన్న రిలేషన్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!!
Bangladesh SuperStar : మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ప్రస్తుతం రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. సాక్షాత్తు ప్రధాని షేక్ హసీనా సైతం అల్లర్లను కంట్రోల్ చేయలేక రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయారు. దీంతో అక్కడ సంక్షోభం ముదిరి పాకాన పడింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కు సంబంధించిన పలు విషయాలను తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ షారుక్ ఖాన్ గా పేరు సంపాదించుకున్న బాలివుడ్ నటుడు ఒకరు ఉన్నారు.
90లలో బంగ్లాదేశ్‌లో చంకీ పాండే టాప్ స్టార్: ఆయనను బంగ్లాదేశ్ షారుఖ్ ఖాన్ అని పిలుస్తారు. అతడు మరెవరో కాదు చుంకి పాండే. చుంకీ పాండేను బంగ్లాదేశ్ సూపర్ స్టార్ అని పిలుస్తారు. ఆయన బాలీవుడ్ లో 80వ దశకంలో పలు సినిమాల్లో హీరోగా చేశారు. కానీ ఇక్కడ సక్సెస్ తగ్గకపోవడంతో బంగ్లాదేశ్ చిత్ర పరిశ్రమకు తరలి వెళ్లారు. బంగ్లాదేశ్ చిత్ర పరిశ్రమ బెంగాలీ భాష చిత్రాలను నిర్మిస్తుంది. అక్కడ చుంకీ పాండే ఒక సూపర్ స్టార్ అయ్యారు.
బంగ్లాదేశ్ షారూఖ్ ఖాన్ : నిజానికి చుంకీ పాండే 1987లో వచ్చిన ఆగ్ హి ఆగ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అయినప్పటికీ అతడు హీరోగా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో హీరోల పక్కన సపోర్టింగ్ యాక్టర్ గా మిగిలిపోయాడు. ఆంఖే, తేజాబ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కనిపించినప్పటికీ, సపోర్టింగ్ నటుడుగానే మిగిలిపోయాడు.
చంకీ పాండే బంగ్లాదేశ్ సినిమాలు : ఆ తర్వాత చుంకీ పాండే తన అదృష్టం పరీక్షించుకునేందుకు పొరుగు దేశం బంగ్లాదేశ్ వెళ్లాడు. అక్కడ అనేక సినిమాలకు పనిచేశాడు. అతను నటించిన 'స్వామి కేనో ఆసామి', 'బేష్ కొరేచి ప్రేమ్ కొరేచి' వంటి మొత్తం 6 బంగ్లాదేశ్ చిత్రాలలో నటించారు. బెంగాలీ భాష తెలియనప్పటికీ చుంకీ పాండే మంచి విజయాలు సాధించడం గమనార్హం.
చంకీ పాండే కూతురు అనన్య పాండే: ఆ తర్వాత చుంకీ పాండే పార్టీ మళ్లీ బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి ఆయన విలన్ పాత్రల్లో కనిపించడం ప్రారంభించారు. ప్రభాస్ నటించిన ఫ్యాన్ ఇండియా సూపర్ హిట్ చిత్రం సాహోలో చుంకీ పాండే విలన్ గా కనిపించారు. అయితే చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో విజయవంతమైన హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. ఆమె విజయ దేవరకొండ నటించిన టైగర్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చుంకీ పాండే ముంబైలోనే ఉంటున్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనను అభిమానించే అభిమానులు ఉన్న దేశంలో ఇలాంటి పరిణామాలు రావడం దురదృష్టకరమని బాధ వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో పరిణామాలు అటు అంతర్జాతీయ సమాజాన్ని కూడా కలవరానికి గురి చేస్తున్నాయి. పశ్చిమ దేశాలు బంగ్లాదేశ్ లో జరుగుతున్న రాజకీయ అనిశ్చితిని గమనిస్తున్నాయి.అగ్రరాజ్యం అమెరికా కూడా బంగ్లాదేశ్ పరిణామాలను ఒక గంట గమనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఎలాంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉంది అనే విషయంపై అంతర్జాతీయ సమాజంలో తీవ్రంగా చర్చ నడుస్తోంది.