Climate Change Warning: ప్రమాదంలో ఆ దేశాలు, భవిష్యత్తులో 58 లక్షలమంది మృత్యువాత

జల వాయు కాలుష్యం కారణంగా చలి కంటే వేడిమి కారణంగా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య ఎక్కువని తెలుస్తోంది.

ఈ అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తనుంది. ఈ ప్రభావం కేవలం వేసవిపైనే కాకుండా చలికాలంలో కూడా ఉంటుంది

ఈ భయంకర విధ్వంసానికి కారణం మనిషి చేసే పొరపాటు, తప్పులే. శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పట్నించే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రానున్న కాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదురుకావచ్చు.
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపిల్ మెడిసిన్ శాస్త్రవేత్తల ప్రకారం 2015 నుంచి 2099 మధ్యకాలంలో యూరప్‌లో ఏకంగా 58 లక్షల మంది మరణించవచ్చుని తెలుస్తోంది.
ఇటీవల వచ్చిన ఓ హెచ్చరిక మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇది యూరప్ గురించిన వార్నింగ్. రానున్న 75 ఏళ్లలో 58 లక్షల మంది మృత్యువాత పడతారనే హెచ్చరిక. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది కచ్చితంగా జరుగుతుందంటున్నారు
ఇటీవలి కాలంలో భవిష్యత్ గురించి విన్పిస్తున్న కొన్నిహెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి నేరుగా భూగర్భ శాస్త్రవేత్తలు ఇస్తున్న వార్నింగ్ ఇది. రానున్న కాలంలో ఏం జరగనుందో చెప్పే హెచ్చరిక ఇది