Joint Pain Relief: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ నూనెతో చెక్..
ఈ లంగం నూనెలో ఉండే మూలకాలు స్కిన్ అలర్జీల, మొటిమల సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు కీళ్ల నొప్పులపై ప్రభావవంతంగా పని చేస్తుంది.
ప్రస్తుతం చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే సమస్యలకు చెక్ పెట్టేందుకు లవంగాల నూనెను వినియోగించవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
లవంగం నూనెలో ఉండే మూలకాలు పంటి నొప్పి వివిధ రకాల దంతాల సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తుంది. కాబట్టి దీనిని కీళ్ల నొప్పుల సమస్యలకే కాకుండా పంటి నొప్పులకు కూడా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ నూనె చాలా మంది సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి చలికాలంలో వినియోగిస్తారు. అయితే ఇందులో శరీరాన్ని వెచ్చగా ఉంచే గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. దీనిని తరచుగా వినియోగించడం వల్ల కీళ్ల నొప్పలకు కూడా చెక్ పెట్టొచ్చు.
లవంగం నూనెలో ఐరన్, యాంటి ఆక్సిడెంట్లు, భాస్వరం, పొటాషియం, సోడియం ఉంటాయి. కాబట్టి ఈ నూనెను తీసుకుంటే శరీర సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్-ఎ, సిలు కూడా అధికంగా లభిస్తాయి.