AP Volunteers: వాలంటీర్లకు బిగ్‌షాక్.. శాసనమండలిలో తేల్చేసిన ప్రభుత్వం
వాలంటీర్ వ్యవస్థపై ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ లేవనెత్తింది.
రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఉందా లేదా అని వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రశ్నించగా.. చర్చ సందర్భంగా రచ్చ రచ్చ జరిగింది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారో లేదో చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది.
అనంతరం మంత్రి డోలా బాలవీరాంజయ స్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతం వాలంటీర్లు లేరని తేల్చి చెప్పారు. రూ.10 వేలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురు ప్రశ్న వేశారు.
వాలంటీర్ వ్యవస్థ కోసం వైసీపీ హయాంలో జీవో ఎందుకు తీసుకురాలేదని మంత్రి డోలా నిలదీశారు. లేని వ్యవస్థను అసలు ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించారు.
ఒకవేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతామన్నామని.. అసలు కొనసాగించలేదు కాబట్టి జీతాలు పెంచమన్నారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు అర్థమవుతోంది.