Chandrababu: స్వగృహం చేరుకున్న సీఎం చంద్రబాబు.. 10 రోజులు కలెక్టరేట్ ఇల్లు, బస్సు బెడ్రూమ్
Chandrababu Reached Residence: భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నీట మునిగింది. లక్షల సంఖ్యలో ప్రజలు వరద ముంపులో చిక్కుకున్నారు.
Chandrababu Reached Residence: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వరద సహాయ చర్యల్లో సీఎం చంద్రబాబు మునిగారు.
Chandrababu Reached Residence: వరద సహాయాల కోసం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే మకాం వేశారు.
Chandrababu Reached Residence: కలెక్టర్ కార్యాలయాన్ని తాత్కాలిక ముఖ్యమంత్రి కార్యాలయంగా చేసుకుని అక్కడి నుంచే పరిపాలన సాగించారు.
Chandrababu Reached Residence: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ చర్యలను ముమ్మరం చేశారు.
Chandrababu Reached Residence: ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, వాయుసేన, కేంద్ర ప్రభుత్వం ఇలా అన్ని వర్గాల నుంచి సహాయ పొందుతూ విజయవాడలో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు.
Chandrababu Reached Residence: వరద బాధితులకు మూడు పూటల ఆహారం, నీళ్లు అందిస్తూనే.. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పర్యవేక్షించారు.
Chandrababu Reached Residence: వరదలకు కారణమైన ప్రకాశం బ్యారేజ్, బుడమేరు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు నిత్యం ఆదేశాలు ఇస్తూ వరద తగ్గుముఖం పట్టేలా చేశారు.
Chandrababu Reached Residence: పది రోజుల అనంతరం 10వ తేదీ మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయాన్ని వీడారు. ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు.
Chandrababu Reached Residence: వరదల సమయంలో చంద్రబాబు చూపించిన తెగువ.. సహాయ చర్యలు ప్రజలను ఆకట్టుకుంది.