Pratyusha`s marriage: సీఎం కేసీఆర్ దత్తపుత్రిక వివాహం ఫోటో గ్యాలరీ

Mon, 28 Dec 2020-8:58 pm,

ఆదివారం జరిగిన ప్రత్యూష పెళ్లి కూతురు వేడుకకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు సభితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ( Twitter Photo )

ప్రత్యూష తల్లిదండ్రులు ( Pratyusha's parents ) ఆమె చిన్నప్పుడే విడిపోగా... 2003లో ఆమె తల్లి చనిపోయారు. చనిపోయే ముందు ప్రత్యూష తల్లి తన పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులన్నీ తన కూతురి పేరుపై రాసి చనిపోగా.. ఆ తర్వాత ప్రత్యూష తండ్రి ఆమెను ఓ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చేర్పించారు. ( Twitter Photo )

అనంతరం 2013లో ప్రత్యూషను ఆమె తండ్రి ఇంటికి తీసుకురాగా.. ఆస్తి కోసం ప్రత్యూష సవతి తల్లి ప్రత్యూషను వేధించి చిత్రహింసలకు గురిచేసింది. ప్రత్యూష అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకం గురించి తెలుసుకున్న బాలల హక్కుల సంఘం.. 2015లో ఆమెను ఆ నరకం నుంచి కాపాడి బయటకు తీసుకురాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బాలికను దత్తత ( CM KCR adopted Pratyusha as his daughter ) తీసుకున్నారు. ( Twitter Photo ) 

ప్రత్యూషను చదివించి ఆమె జీవితంలో స్థిరపడేలా తానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని అప్పట్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ( Twitter Photo )

2019లో నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన ప్రత్యూష.. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. ( Twitter Photo )

ప్రత్యూషకు పెళ్లి చేయాలని భావించిన సీఎం కేసీఆర్ ( CM KCR )... ఆమెకు రెండు నెలల క్రితమే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ప్రకారమె ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న చరణ్ రెడ్డితో ( Pratyusha weds Charan Reddy ) 2 నెలల క్రితమే ప్రత్యూషకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. ( Twitter Photo )

శుక్రవారమే సీఎం కేసీఆర్ భార్య శోభమ్మ ( CM KCR's wife Shobhamma ) తమ దత్తత పుత్రిక ప్రత్యూషకు పెళ్లికోసం అవసరమైన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు సమర్పించారు. ( Twitter Photo )

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link