Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్ సర్కార్ మహిళలకు పండుగ కానుక..!
తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ బతుకమ్మ కానుక ప్రకటించనుంది. అయితే, ఈసారి చీరలకు బదులుగా రూ.500 ఇవ్వాలని సంబంధిత వివరాలు కూడా పరిశీలించింది. ముఖ్యంగా బతుకమ్మ అంటేనే తెలంగాణ రాష్ట్ర పండుగ.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి మొదటగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత రూ.500 సిలిండర్ కూడా ఇచ్చింది. రూ.2500 మహిళల ఖాతాల్లో జమా చేయడం పై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోందట.
అయితే, మరో 10 రోజుల్లో బతుకమ్మ పండుగ కూడా ప్రారంభం కానుంది. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చీరలను కానుకగా ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.500 నగదు ఇచ్చేలా ప్రభుత్వం పరిశీలిస్తోందట.
రూ.500 లేదా ఆపైనా అందించేలా కసరత్తు చేస్తోందట. ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలలో నాణ్యత కొరవడిందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట.
ఈ నగదును మహిళల ఖాతాల్లో జమా చేయడానికి రేషన్ కార్డును ప్రతిపాదికను తీసుకునేలా పరిశీలిస్తోందట. వారి చేతికి ఇవ్వాలా అని కూడా పరిశీలన చేస్తోందట. స్వయం సంఘాల సభ్యత్వం ఆధారంగా ఈ కానుక ఇచ్చేఆ ప్రయత్నిస్తోందట.
మరో మూడు రోజుల్లో ఈ విషయం పై క్లారిటీ వస్తుంది. అయితే, ఇప్పటికే చేనేత వారికి కూడా చీరలకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది చేనేతకు ఉపాధి అందిస్తోంది. నిర్మల్, సిరిసిల్ల, పోచంపల్లి వారు ఈ చీరలను నేస్తారు.
వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చేవారు. ఇలా నగదు ఇస్తే వారి ఉపాధికి గండి పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందోచూడాలి.