CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని చెరువులు సుందరీకరణ, చెరువులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొవాలని బల్దియాకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ ను అన్నిరకాలుగా డెవలప్ చేయాలనే టార్గెట్ గా సీఎం ముందుకు వెళ్తున్నారు.
దీనిలో భాగంగా హైదరాబాద్ లో.. అనేక చోట్ల చెరువులు కబ్జాలకు గురౌతున్నట్లు సీఎం రేవంత్ కు సమాచారం చేరవేశారంట. ఈ నేపథ్యంలో ఏకంగా దీనిపై సీఎం రేవంత్ కమిషనల్ ఆమ్రాపాలికి కీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముఖ్యంగా.. మీరాలంచెరువుతో పాటు.. నగర వ్యాప్తంగా ఉన్న చెరువులపై ప్రత్యేకంగా నజర్ పెట్టాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 190 వరకు కూడా చెరువులున్నట్లు తెలుస్తోంది.
వర్షాకాలం నేపథ్యంలో చెరువుల విషయంలో కమిషనర్ ఆమ్రాపాలీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పారిశుద్ధ్య పనులతో పాటు.. ఆయా ప్రాంతాల్లోని చెరువుల పరిరక్షణ, సుందరీకరణపై కూడా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసుకొవాలని కూడా ఆమ్రాపాలీ జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు.
నగరంలో పలు చోట్ల చెరువులు కబ్జాలకు గురౌతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆయా ప్రాంతాల పరిధిలోని జోనల్ కమిషన్లకు ఆమ్రాపాలీ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎక్కడిక్కడ అధికారులు ప్రస్తుతం చెరువులకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 2,350 వరకు చెరువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ చెరువులను కాపాడటంతో పాటు.. చెత్తచెదారం వేయకుండా.. ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేయాలని కూడా ఆమ్రాపాలి అధికారులను ఆదేశించింది. భవన నిర్మాణ వ్యర్థాలు, ఫ్యాక్టరీల నుంచి కెమికల్స్ లు చెరువులో వేయకుండా ఆయా పరిధిల్లోని జోనల్ అధికారులు నిరంతరం దృష్టి సారించాలని కూడా బల్దియా కమిషనర్ సీరియస్ గా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీలోని హెల్త్, సానిటైజేషన్, టౌన్ ప్లానింగ్, లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ అధికారులంతా సమన్వయంతో పనిచేసి చెరువులు కబ్జా కాకుండా చూడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒకవేళ.. మురుగు నీరు చెరువులోకి భారీగా వస్తున్న నేపథ్యంలో.. వాటిని ట్రీట్‌మెంట్ ప్లాంట్లలోకి పంపి, శుద్ధి చేసి మరల చెరువుల్లోకి వదిలితే సీవరేజీ తీవ్రత తగ్గే అవకాశముంటుందని కూడా అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.