Coconut Water Precautions: కొబ్బరి నీళ్లతో నష్టాలు కూడా ఉన్నాయని తెలుసా, ఎవరెవరు తాగకూడదు
మధుమేహం వ్యాధిగ్రస్థులు జాగ్రత్త
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తరచూ కొబ్బరి నీళ్లు తాగకూడదు. అప్పుడప్పుడు తాగవచ్చు. తరచూ తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫలితంగా కిడ్నీలపై ప్రభావం పడుతుంది.
కడుపు నొప్పి పెరగవచ్చు
అజీర్తి సమస్య ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉంటే మంచిది. లేకపోతే కడుపులో నొప్పి పెరగడం లేదా డయేరియా సమస్య రావడం జరగవచ్చు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో పెద్దమొత్తంలో ఉండే పొటాషియం కడుపుకు నష్టం చేకూరుస్తుంది
కొబ్బరి నీళ్లతో నష్టాలు
ఆయుర్వేదం ప్రకారం కొబ్బరి నీళ్లతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని వ్యాధులతో సతమతమయ్యేవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. లేకపోతే లాభాల కంటే హాని ఎక్కువగా కలగవచ్చు
లో బీపీ సమస్య
అధిక రక్తపోటుతో బాధపడేవారికి కొబ్బరి నీళ్లు తాగమని సూచిస్తుంటారు. కానీ మోతాదుకు మించి తాగితే బ్లడ్ ప్రెషర్ తక్కువై లోబీపీ సమస్య రావచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి
ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్
కొబ్బరి నీళ్లు అప్పుడప్పుడూ తాగితే ఏం కాదు. కానీ పరిమితి దాటి తాగితే మాత్రం శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చెడిపోతుంగది. దాంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు.