COVID-19 facts: కరోనా సోకిన వారిలో 78% మంది overweight లేదా obesity పేషెంట్సే

Thu, 11 Mar 2021-8:15 pm,

కరోనా అంటే భయపడే స్థాయి నుంచి కరోనాను ధైర్యంగా ఎదుర్కునే స్థాయికి చేరుకున్నాం. కరోనాను ఓడించేందుకు జరుగుతున్న ఈ పోరాటంలో 2021 ఆరంభం నుంచే మనకు COVID-19 vaccines కూడా అందుబాటులోకి వచ్చాయి.

కరోనా సోకిన వారికి ఎన్నిరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందనే అంశంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సైడ్ ఎఫెక్ట్స్ (New side effects of COVID-19) వెలుగుచూస్తూనే ఉన్నాయి.

అలాగే Center for Disease Control and Prevention జరిపిన ఓ తాజా అధ్యయనంలో కొవిడ్-19తో తీవ్రంగా బాధపడిన వారిలో చాలా మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్న వారేనని అధ్యయనం తేల్చిచెప్పింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ సంస్థకి చెందిన Morbidity and Mortality Weekly Report లో ఈ అధ్యయనం ఫలితాలను ప్రచురించారు.

కరోనా సోకిన 1,48,494 మంది Adults లో 72, 491 మంది అనారోగ్యంతో ఆస్పత్రిపాలు కాగా... వారిలో 28.3 శాతం మంది overweight తో బాధపడుతుండగా మరో 50.2 శాతం మంది obesity తో బాధపడుతున్నట్టు తేలింది. అంటే మొత్తం 78 శాతం మంది overweight లేదా obesity కి గురైన వారే కరోనా బారిన పడ్డారని ఈ అధ్యయనంలో వెల్లడైందన్నమాట.

Over weight కి ఒబేసిటీకి మధ్య తేడా ఏంటనే సందేహం రావచ్చేమో. ఈ రెండింటి మధ్య ఉన్న స్వల్ప తేడా ఏంటో చెప్పాలంటే Body mass index అనేది 25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది Overweight అవుతుంది. అలాగే Body mass index 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే అది obesity అవుతుంది అంటున్నారు Health experts.

మనిషి బరువు, వారి ఎత్తు ఆధారంగా వారి శరీరంలో ఉన్న కొవ్వును లెక్కించే పద్దతినే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు.

Online BMI calculator ఉపయోగించి మీరు మీ బాడీ మాస్ ఇండెక్స్‌‌ని లెక్కించవచ్చు. ఒకవేళ మీరు Obesity తో బాధపడుతున్నారని BMI test లో తేలినట్టయితే, స్థూలకాయం తగ్గించుకునేలా మీరు మీ Diet planning చేసుకోవచ్చు.

ముఖ్యంగా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే (How to keep your body fit), Healthy food తో పాటు శరీరానికి ప్రతీ రోజూ వ్యాయమం తప్పనిసరి అవసరం అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

Also read : COVID-19 Vaccine: కరోనా టీకాలు తీసుకున్న వారిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది

Also read : Lemon Water: నిమ్మరసం అధికంగా తాగుతున్నారా, ఈ Side Effects తెలుసుకోండి

Also read : Headache with COVID-19: కరోనాతో వచ్చే తలనొప్పికి, సాధారణ తలనొప్పికి Symptoms ఎలా ఉంటాయి ?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link