Weird Marriage Rituals: అక్కడ పెళ్లి కోసం ఇతరుల భార్యను దొంగలిస్తారు, శిక్ష కూడా ఉండదట..!

Sat, 10 Jun 2023-5:52 pm,

మీరు విన్నది నిజమే. ఆఫ్రికాలో ఒక తెగ ఉంది. ఇక్కడ ప్రజలు వివాహం చేసుకోవడానికి ఇతరుల భార్యలను దొంగిలించవలసి ఉంటుంది.  

ఆఫ్రికాలోని వోడబ్బో తెగలో వింత ఆచారం ఉంది. ఇక్కడి వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే.. ఇతరుల భార్యలను దొంగలించి జీవిత భాగస్వామిని చేసుకోవాల్సి ఉంటుంది.  

ఈ తెగలో కుటుంబ సభ్యుల అంగీకారంతో మొదటి వివాహం జరుగుతుంది. అయితే రెండో పెళ్లికి సంబంధించి ఆచారంలో కాస్త ట్విస్ట్ ఉంది. ఎవరైనా మరొకరిని వివాహం చేసుకోవాలనుకుంటే, అతను మరొకరి భార్యను దొంగిలించవలసి ఉంటుంది. అలా కుదరకపోతే మళ్లీ పెళ్లి చేసుకునే హక్కు రాదు.  

ఈ తెగకు చెందిన గిరిజనులు ప్రతి సంవత్సరం గేరెవోలు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పండుగలో అబ్బాయిలు ముఖానికి రంగులు పూసుకుంటారు. అనంతరం అతడు డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొంటాడు. ఇందులో తన నృత్యంతో వేరొకరి భార్యను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు.   

అయితే సదరు వ్యక్తి మహిళ భర్తకు తెలియకుండా ఇదంతా చేయాల్సి ఉంటుంది. ఆ వివాహిత అతడి పట్ల ఆకర్షితుడై ఇంటి నుంచి పారిపోతే.. వారిని కనిపెట్టి పెళ్లి చేస్తారు. దీనిని లవ్ మ్యారేజ్ గా పేర్కొంటారు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link