KL Rahul and Athiya shetty: క్రికెటర్ రాహుల్, అతియా శెట్టిల మధ్య ఎఫైర్‌కు సాక్ష్యమిదే

Sun, 24 Jan 2021-9:21 pm,

అతియా పుట్టినరోజు నాడు కేఎల్ రాహుల్..ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఇద్దరూ కలిసి కన్పించారు. ఈ ఫోటోలో రాహుల్, అతియా శెట్టిలు చాలా సన్నిహితంగా ఉన్నారు. 

కేఎల్ రాహుల్ పుట్టినరోజు సందర్బంగా అతియా..అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ...నా వ్యక్తి అంటూ తమ బంధాన్ని దాదాపుగా ధృవీకరించింది. 

అతియా శెట్టి, రాహుల్‌లు కలిసి కన్పించడం ఇదేమీ తొలిసారి కాదు. ఇద్దరూ కలిసి వెకేషన్‌కు కూడా వెళ్తుంటారు. ఇద్దరి రొమాంటిక్ ఫోటోలు  చాలా సార్లు షేర్ చేశారు. 

అతియా శెట్టి..ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్‌లు ఇటీవలికాలంలో ఇన్‌స్టా‌గ్రామ్‌లో కామెంట్లు కూడా చేసుకుంటున్నారు. 

అంతేకాకుండా..అతియా శెట్టితో తన ఫోటోల్ని కూడా శీతల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను కొంతమంది మంచి స్నేహితులతో కలిసి పెరిగాను. వాళ్లంతా మొదట్నించీ నా కుటుంబ సభ్యులు.చాలా ఆనందంగా ఉంది నాకు..ఈ కుటుంబం జీవితంలోని ప్రతి దశలో వృద్ధి చెందుతోంది..అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. 

ఇప్పుడు అతియా శెట్టి, కేఎల్ రాహుల్ డిన్నర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి డిన్నర్‌కు హాజరయ్యారు. క్రికెటర్ రాబిన్ ఊతప్ప భార్య శీతల్..ఈ డిన్నర్‌కు సంబంధించి కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link