Siraj Buys New Car: టీ20 ప్రపంచకప్ డబ్బులతో కారు కొన్న క్రికెటర్ మహ్మద్ సిరాజ్
![Siraj Cricket Records Siraj Records](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/sirajlandroversuvcar_0.jpg)
Mohammed Siraj: భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం క్రికెట్ నుంచి కొంత విరామం తీసుకున్నాడు.
![Pacer Mohammed Siraj Car Pacer Mohammed Siraj](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/sirajlandrovercar.jpg)
Mohammed Siraj: టీ 20 ప్రపంచకప్, శ్రీలంకతో సిరీస్ అనంతరం సిరాజ్ హైదరాబాద్‌కు పరిమితమయ్యాడు. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు.
![Mohammed Siraj Land Rover Car SUV Mohammed Siraj Land Rover Car](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/sirajlandrovercarcost.jpg)
Mohammed Siraj: అంతర్జాతీయ ఖ్యాతిలో తెలంగాణ సత్తా చాటుతున్న సిరాజ్ తాజాగా కారు కొనుగోలు చేశాడు. తనకు ఇష్టమైన ల్యాండ్ రోవర్ కారును తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి కారు కొన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో మియా పంచుకున్నాడు.
Mohammed Siraj: అయితే సిరాజ్ కొన్న కారు విలువ దాదాపు రూ.3 కోట్లు అని తెలుస్తోంది. అయితే టీ 20 ప్రపంచకప్ విజయం సాధించిన బీసీసీఐ అందించిన నగదు బహుమతి డబ్బులతో కొన్నట్లు సమాచారం. ప్రపంచ్ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో సిరాజ్ వాటాగా రూ.5 కోట్లు దక్కాయని చర్చ నడుస్తోంది. ఆ డబ్బు నుంచే ఈ కారును కొనుగోలు చేసినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి.
Mohammed Siraj: భారత క్రికెట్‌లో తన బౌలింగ్‌తో అద్భుతాలు సాధిస్తూ ప్రపంచకప్‌లో సత్తా చాటిన సిరాజ్‌కు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కానుకలు అందించింది. ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో సిరాజ్‌కు 600 గజాలకు పైగా నివాస స్థలం ఇచ్చింది.
Mohammed Siraj: మరికొన్ని రోజులు విరామం తీసుకున్న తర్వాత మళ్లీ సిరాజ్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో తన బౌలింగ్ ప్రదర్శన మెరుగు చేసుకునేందుకు మరింత శిక్షణ తీసుకోనున్నాడు.