Samagra kutumba Survey: వామ్మో.. కుటుంబ సర్వే పేరుతో కొత్త తరహా దోపిడి.. ఈ పనులతో తస్మాత్ జాగ్రత్త అంటున్న అధికారులు..
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సమగ్రకుటుంబ సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలకు చెందిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలోని ప్రజల ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఇంట్లోని వాళ్లు యజమాని, పిల్లలు, కుటుంబ జీవనాధారం, ఉద్యోగాలు, రాజకీయాల్లో ఉన్నారా.. పోలాలు ఉన్నాయా తదితర వివారలు చెప్పాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఏదైన లోన్ లు ఉంటే.. దానికి సంబంధించిన డిటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే.. సమగ్ర సర్వే ఒకవైపు కొనసాగుతుండగానే.. సైబర్ నేరగాళ్లు ఇదే చాన్స్ లాగా రెచ్చిపోతున్నారంట. మొదట ఇళ్లలోకి సర్వేపేరుతో గ్యాంగ్ ప్రవేశిస్తున్నారంట. ఫెక్ ఐడీలను వెంట పెట్టుకుని.. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారంట. నలుగురు లేదా ఐదుగురు టీమ్ లుగా ఏర్పడి..అమాయకుల్ని, ఒంటరిగా ఉన్నవాళ్లను టార్గెట్ చేసుకుంటున్నారంట.
మొదట్లో అన్ని ఆధార్ కార్డు, రేషన్ వివరాలు సేకరించి నమ్మకం కలిగే విధంగా మాట్లాడుతున్నారంట. తమ బుట్టలో పడిపోయారనుకున్నాక.. బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్, బయోమెట్రిక్ చేయాల్సి ఉందని చెబుతున్నారంట. బయోమెట్రిక్ తర్వాత మెుబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందని ఆ డీటెయిల్స్ కూడా చెప్పాలని అడుగుతున్నారంట.
దీంతో అమాయకులు ఇలాంటి మోసాలకు బారిన పడుతున్నారంట. ఈ తరహా ముఠాలు తెలంగాణలోని కొన్ని పల్లెల్లో తిరుగుతున్నాయని పోలీసులు సమాచారం అందిందంట. జనాభా లెక్కలు, కుటుంబ సర్వే కోసం అని వచ్చే ప్రతి ఒక్కరిని నమ్మటానికి వీల్లేదని అంటున్నారు. జనాభా సర్వేల కోసం వచ్చే వారు ఎవరు.. బ్యాంక్ అకౌంట్, ఖాతాల వివరాలు అడగరని పోలీసులు చెబుతున్నారు.
ఎవరైన బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు అడిగితే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు ప్రజల్ని కోరుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.