Cyber ​​Crime Alerts in Hyderabad: హ్యాప్పీ న్యూఇయర్​ అంటూ లింక్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త పడాల్సిందే..ఇదే సైబర్ నేరగాళ్ల నయా ట్రిక్

Tue, 31 Dec 2024-8:38 pm,

Cyber ​​Crime Alerts in Hyderabad: మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త తరహా మోసాలతో బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కువగా ఉందని రాచకొండ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మీ పేరుతో కానీ మీ స్నేహితులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, విషెస్ కార్డులు పంపే లింక్స్ పంపిస్తున్నారు. కావాలంటే కార్డును పొందేందుకు ఇక్కడ ఉన్న లింక్ పై క్లిక్ చేయమని మెసేజ్ లో సూచిస్తున్నారు. 

సైబర్ నేరగాళ్లు పంపించే ఫేస్ లింక్స్ ను పట్టించుకోద్దని పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఒకవేళ దీని లింక్ ను క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు మొబైల్ ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ  లింకును క్లిక్ చేసినట్లయితే సైబర్ నేరగాళ్లు మొబైల్ ని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.

లింక్ క్లిక్ చేసినట్లయితే మొబైల్ లో ఉన్న డేటా, గ్యాలరీ, పర్సనల్ మొబైల్ నెంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు, పూర్తిగా సైబర్ నేరగాల చేతిలోకి వెళ్లిపోతాయని చెబుతున్నారు. ఖాతాలోని సొమ్ము, విలువైన సమాచారాన్ని కూడా తస్కరించే ఛాన్స్ ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలియని వారి నుంచి ఎలాంటి మెసేజ్లు వచ్చినా వాటిపై క్లిక్ చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. కొత్త సంవత్సరం మెసేజ్ విషయంలో ఇటువంటి సైబర్ లింక్స్ పై క్లిక్ చేయవద్దని జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మెసేజ్లు పంపుతున్నారని మరికొద్ది గంటల్లో ఈ దాడులను తీవ్రతరం చేసే ఛాన్స్ ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు అంచనా వేస్తున్నారు.

న్యూ ఇయర్ విషెస్ ఏపీకే ఫైల్స్, ఆకర్షణమైన చిత్రాలు, డిస్కౌంట్ కూపన్స్,  ఆఫర్ కూపన్స్,  ప్రీ ఈవెంట్ పాసులు మెసేజ్లను మీకు పంపాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అంటూ ఆశలు రేకెత్తించే మెసేజ్లు లింకుల పట్ల జాగ్రత్త వహించాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.

ఎవరికైనా అనుమానస్పద లింకుపై క్లిక్ చేసిన మోసపోయిన వెంటనే 1930 నెంబర్లను నెంబర్కు సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే www.cybercrime.gov.in  మోసపోయిన బాధితులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link