Cyclone Dana Effect: ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు.. రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

దానా తుఫాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం అంతగా ఉండదని అంచనా వేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు పొడి వాతావరణం ఏర్పడనుంది.

తెలంగాణలో నేడు కింది స్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశలో గాలులు వీస్తున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు కేవలం పొడి వాతావరణం మాత్రమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇక దానా తుఫాను ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో రైళ్లు, విమాన సేవలు రద్దు అయ్యాయి.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈరోజు రాత్రి వరకు తుఫాను ప్రభావం ఉండనుంది. అత్యవసరం ఉంటే బయటకు రాకూడదని ప్రజలను హెచ్చరించారు.
దానా తుఫాను ముప్పు మాత్రం ఏపీకి తప్పినట్టే అవుతుందా? అని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ, రానున్న మూడు రోజులు మాత్రం ఇలాగే పొడి వాతావరణం ఏర్పడనుంది.
ఇదిలా ఉగ్రరూపం దాల్చితున్న దానా తుఫాను ప్రభావంతో ఏపీలో కూడా తీర ప్రాంతాలకు అలెర్ట్ జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లకూడదని కూడా హెచ్చరించారు.