Darshan wife: బాంబు పేల్చిన దర్శన్ భార్య.. పవిత్ర గౌడ కేసులో మరో షాకింగ్ పరిణామం..
కన్నడలో దర్శన్ , పవిత్ర గౌడలో ఘటన తీవ్ర సంచలనంగా మారింది. దర్శన్ తన అభిమాని రేణుక స్వామిని అత్యంత దారుణంగా హింసలకు గురిచేసి మరీ హతమార్చాడు. తన ప్రియురాలికి అసభ్యకర మెస్సెల్ పంపడం వల్ల దర్శన్ సుపారీ ఇచ్చి మరీదారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారింది.
ఈ నేపథ్యంలో హత్య అనంతరం నటుడు దర్శన్ ను, ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు, మొత్తం 17 మంది నిందితులుగా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.అయితే కేసు విచారణలో పవిత్ర, దర్శన్‌ను దంపతులుగా బెంగళూరు పోలీసులు రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్నారు. దీనిపై దర్శన్ సతీమణిన విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది.
ఈ క్రమంలో.. తాజాగా బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు విజయలక్ష్మి లేఖ రాసినట్లు సమాచారం. పవిత్రాగౌడకు, తన భర్తకు మధ్య పెళ్లి కాలేదని చెప్పింది. పోలీసులతో పాటు, కర్ణాటక హోంమంత్రి కూడా ఇదే మాట అన్నారని లేఖలో పేర్కొన్నది. హోంమంత్రి ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. నటుడి దంపతులు అరెస్టయ్యారని చెప్పారని విజయలక్ష్మి గుర్తు చేసింది.
ఆమె దర్శన్ భార్య కాదు.. కేవలం నా భర్తకు స్నేహితురాలు మాత్రమే అంటూ లేఖలో స్పష్టం చేశారు.దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని తానే అంటూ చెప్పారు. తమ పెండ్లి 2003లో జరిగింది. పోలీస్ రికార్డుల్లో ఎక్కడ కూడా.. పవిత్ర గౌడను సతీమణిగా పేర్కొనవద్దని కోరారు. ఇది భవిష్యత్‌లో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుందంటూ పేర్కొన్నారు. పవిత్రకు సంజయ్‌సింగ్‌తో పెండ్లి కాగా.. వారికి ఓ కూతురు కూడా ఉందని తెలిపింది.
ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయాలని కూడా బెంగళూరు పోలీసులకు రాసిన లేఖలో కోరింది విజయ లక్ష్మి కోరినట్లు తెలుస్తొంది. మరోవైపు రేణుక స్వామి మర్డర్ కేసులో సోషల్ మీడియాలో నెటిజన్లు దర్శన్ ను బూతులు తిడుతుండగా, కొందరు సెలబ్రీటీలు మాత్రం దర్శన్ కు మద్దతుగా ఉంటున్నారు. ఈ ఘటన మాత్రం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.