Deepika Padukone: ఇక చాలు.. నాకు ఆకలిగా ఉంది.. దీపికా పడుకొనే ఫోటోలు వైరల్

Thu, 20 Jun 2024-12:08 pm,

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇప్పటివరకు ఈ హీరోయిన్ తెలుగు సినిమాలో కనిపించకపోయిన.. ఆమెకి.. ఆమె చేసిన బాలీవుడ్ సినిమాల వల్ల.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

తన బాలీవుడ్ సినిమాల ద్వారానే తెలుగులో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు త్వరలోనే తెలుగు సినిమా కల్కి తో టాలీవుడ్ కి డెబ్యూట్ ఇవ్వనుంది. కాగా కొద్ది సంవత్సరాల క్రితమే రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకున్న.. దీపిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంది.

ఇక ప్రెగ్నెన్సీ టైంలో.. కూడా కల్కి.. సినిమా ప్రమోషన్స్ ని మాత్రం మిస్ అవ్వలేదు ఈ హీరోయిన్. నిన్న ముంబైలో జరిగిన కల్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్లాక్ డ్రెస్సులో అటెండ్ అయ్యింది ఈ హీరోయిన్.

తన బేబీ బంప్ కనిపిస్తూ ఉండడంతో.. దీపిక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రెగ్నెంట్ అయింది.. కూడా ఈ ఈవెంట్ కి అటెండ్ అయినందుకు.. ఆమె అభిమానులు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

కాగా..ఇదే ఫోటోలను.. దీపిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘ఇక చాలు..ఆకలిగా ఉంది’.. అనే క్యాప్షన్ వేసి.. తన ఈవెంట్ ఫోటోలను షేర్ చేయగా.. అవి కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link