Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనె..
కల్కీ ఫెమ్, దీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దీపికా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లైన ఐదేళ్లకు దీపికా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతానికి తల్లి బిడ్డలిద్దరు హెల్తీగానే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వినాయక చవితి నవరాత్రుల్లో ఆడబిడ్డ పుట్టడం పట్ల రణ్ వీర్ , దీపికా ఫ్యామిలీ ఎంతో ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఎక్స్ వేదికగా రణ్ వీర్,దీపికా దంపతులకు వీరి ఫ్యాన్స్ స్పెషల్ గా విషేస్ చెప్తున్నారు. ఇదిలాఉండగా.. నిన్న వినాయక చవితి నేపథ్యంలో దీపికా తనభర్తతో కలిసి ముంబైలోకి ఫెమస్ గణేష్ జీ ఆలయాన్ని సైతం దర్శించుకున్నారు.
వినాయకుడ్ని దర్శించుకున్న కొన్ని గంటలలోపే.. పండంటి ఆడబిడ్డను జన్మనివ్వటం పట్ల కూడా ఇరువైపుల వారు ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇరువైపుల కుటుంబాల్లో కూడా.. సందడి వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితమే.. కల్కీ బ్యూటీ దీపిక.. తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటో షూట్ కూడా నిర్వహించుకున్నారు. దీపికా పదుకొనే , రణ్ వీర్ లు ఫస్ట్ ప్రేమించుకున్నారు. ఆతర్వాత వీరిద్దరు కూడా ఇరుకుటుంబాల అంగీకారంతో.. 2018 లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి అప్పట్లో కూడా తెగ హల్ చల్ చేసిందని చెప్పుకొవచ్చు.
వీరిద్దరు కూడా.. రామ్ లీల, బాజీరావు మస్తానీ లాంటి పలు సినిమాలు నటించారు. పెళ్లి తరువాత కూడా దీపికా పలు సినిమాల్లో నటించారు. జవాన్, పఠాన్ లాంటి సినిమాలల్లో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరీలో.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ఎంగెజ్ మెంట్ సమయంలో.. దీపికాపదుకొనే.. తన ప్రెగ్నెన్సీని అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో వినాయక చవితి మరుసటి రోజు ఆడ బిడ్డకు జన్మనివ్వడం పట్ల.. ఆమె అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.