Deepika Baby Photo: దీపికా- రణవీర్‌ల బేబీ ఫోటో వైరల్‌.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

Wed, 11 Sep 2024-11:06 am,

హిరోయిన్‌ దీపికా పదుకొనే బేబీ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఎప్పుడెప్పుడు చూద్దామా అని దీపికా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తూనే ఉన్నారు. వారికి కనువిందు చేసే ఫోటో ఇది. దీపికా తెలుగులో వచ్చిన కల్కీలో నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇది ప్యాన్‌ ఇండియా మూవీ. రెబల్‌ స్టార్‌ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి సక్సెస్‌ సాధించి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.   

అయితే, సోషల్‌ మీడియాలో విస్త్రతంగా వైరల్‌ అవుతున్న ఈ ఫోటోను చూసి కొందరు AI చిత్రమని పోస్టులు పెడుతున్నారు. ఇక దీపికా ఫ్యాన్స్‌ అయితే, ఇది దీపికా రణవీర్‌ల గారాల పట్టినే అని ఆనందంగా చూస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటో పై ఇంకా దీపికా రణవీర్‌లు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు.  

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ చిత్రంలో దీపికా ఆసుపత్రి బెడ్‌పై గౌను ధరించి ఉంది. ఇక తన గారాల పట్టిని ప్రేమగా తన గుండెలపై పడుకోబెట్టుకున్నట్లు దీపికా పదుకొనే తన బేబీ ఫోటో ఉంది. ఈ ఫోటోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.   

దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ సమయం నుంచే సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్లు పెట్టారు. ముఖ్యంగా దీపికాది రియల్‌ కాదు ఫేక్‌ ప్రెగ్నెన్సీ అని కామెంట్లు పెట్టారు. అయినా కానీ, ఎప్పుడూ దీపికా ఈ కామెంట్లపై ఎప్పుడూ స్పందించలేదు.  

ఇక దీపికా రణవీర్‌లు ఈ పుకార్లకు చెక్‌ పెడుతూ బేబీ బంప్‌తో ఫోటో షూట్‌ కూడా చేశారు. ఆ తర్వాత దీపికా రణవీర్‌లు డెలివరీకి ముందు సిద్ధివినాయక ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో జాయిన్‌ అయి ఓ బేబీకి జన్మనిచ్చారు. (సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ఆధారంగా ఈ కథనం రాసింది. జీ కన్నడ న్యూస్ దీనికి బాధ్యత వహించదు.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link