Deepika Padukone: ప్రెగ్నెన్సీ డైట్ బయటపెట్టిన దీపికా పడుకోణె.. ఫోటోలు చూశారా..
హిమేష్ రేషమ్మియా తీసిన ఆప్ కా సురూర్ లోని నాం హై తేరా అనే మ్యూజిక్ వీడియో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి దీపికా పడుకోణె
ఆ తరువాత పడుకోణె ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.
మొదట నటించింది సౌత్ ఇండియా చిత్రంలోనే అయినా దీపికాకి మంచి పేరు తెచ్చి పెట్టిన చిత్రం మాత్రం షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం. ఆ చిత్రం తరువాత నుంచి దీపికా రేంజ్ మారిపోయింది.
నార్త్ ఇండియాలో వరసగా అవకాశాలు అందుకుంటూ నటిగా దూసుకుపోయింది. బాలీవుడ్ లో ఎన్నో అవార్డులు రివార్డులు సైతం సంపాదించింది ఈ హీరోయిన్.
కాగా ఈ మధ్య బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ అని పెళ్లి చేసుకున్న దీపిక ప్రెగ్నెంట్ అని గత కొద్ది రోజుల నుంచి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో దీపిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హెల్తి ఫుడ్ తింటూ.. రెస్ట్ తీసుకుంటూ కనిపించిన దీపిక ఫోటోలు చూసి.. ఈ హీరోయిన్ చెప్పకనే తన ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.