Deepika Padukone Sister: నటి దీపికా పదుకొణె చెల్లిని చూసారా? అక్కను మించిన అందంతో షేక్ చేస్తోన్న బ్యూటీ..

Mon, 05 Aug 2024-1:01 pm,

సినీ ఇండస్ట్రీలో వారసత్వం ఎప్పటి నుంచో ఉంది. అందులో అన్నాతమ్ముడు,  తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు, అక్కా చెల్లుల్లు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది రాజ్యం ఏలుతున్నారు. కానీ దీపికా పదుకొణేకు ఓ చెల్లెలు  ఉంది. ఆమె లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీపికా పదుకొనే చెల్లెలు పేరు అనీషా పదుకొనే. వీళ్ల మధ్య 5 యేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. వీరిద్దరి బాల్యం అంతా బెంగళూరులో గడిచింది. అనీషా బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో చదువుకుంది.

అనీషా పదుకొణే.. అక్కబాటలో సినీ ఇండస్ట్రీ వైపు కాకుండా.. తండ్రి ప్రకాష్ పదుకొనే బాటలో బాట్మింటన్ తో గోల్ఫలో  రాణిస్తోంది.

అనీషా  తండ్రి బాటలో క్రీడల్లో రాణిస్తోంది. సినిమాలకు దూరంగా ఉంది. అందుకే బయట పెద్దగా కనిపించదు. లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తోంది. ఈమె సోషల్ మీడియాను పెద్దగా ఫాలో కాదు.

అనీషా అద్భుతమైన గోల్ఫ్ క్రీడాకారిణి. అంతేకాదు భారత దేశం తరుపున ఈమె గోల్ఫ్ ఆటకు ప్రాతినిథ్యం వహించింది.

అనీషా కేవలం గోల్ఫ్ మాత్రమే కాదు..క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ తో పాటు హాకీలో ఆమెకు మంచి పట్టు ఉంది. దీపికా విషయానికొస్తే.. ఈ యేడాది ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో పలకరించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link