Deepika Padukone: రేఖనా? దీపికనా? గుర్తుపట్ట లేనంతగా మారిపోయిన ప్రభాస్ బ్యూటీ..!

'కల్కీ' సినిమాలో ప్రెగ్నెన్సీ మహిళగా నటించిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇటీవల పాపకు జన్మనిచ్చారు. ఆ పాప పేరు దువా. అప్పట్లో పాప పేరుపై కూడా పెద్ద కామెంట్లు కూడా వచ్చాయి. తాజాగా దీపిక పదుకొనే సభ్యసాచి దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసింది. ఆ వీడియోలో దీపికా పదుకొనే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

ఇక డెలివరీ తర్వాత మొదటిసారిగా ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఆమె లుక్ చూసిన అభిమానులు, నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. దీపిక ఏంటి బొద్దుగా మారిపోయింది? అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది నటి రేఖలా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ నటించిన ఫ్యాన్ ఇండియా మూవీ కల్కీ సినిమాలో ఆమె ప్రెగ్నెన్సీతోనే నటించారు.
అయితే సెప్టెంబర్ నెలలో దువాకు జన్మనిచ్చింది. గర్భిణిగా ఉండగానే కల్కి మూవీలో నటించి దీపికా పదుకొనే తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించారు. కొంతమంది నెటిజెన్లు అయితే ఇది దీపికనా? రేఖనా? గుర్తుపట్టడానికి 5 నిమిషాల సమయం పట్టింది అని ఇంస్టాగ్రామ్ వేధికగా రాసుకొచ్చారు.
ఇక ఈ ర్యాంప్ వాక్‌లో బాలీవుడ్ సెలబ్రిటీ సోనం కపూర్, అలియా భట్, అదితీ రావు హైదరీ, అనన్య పాండే, శబ్నా అజ్మీ, శోభిత ధూళిపాల్ల కూడా ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిన ఆకర్షించారు. ఇక సభ్యసాచి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ బ్రాండ్ సెలబ్రేషన్ లో భాగంగా ఈ వేడుక నిర్వహించారు.
నటి దీపిక పదుకొనే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కూతురు. ఆమె కూడా నేషనల్ లెవల్‌లో బ్యాడ్మింటన్ ప్లేయర్. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఒక పాప దూవా ఉంది. ఈమె మొదటి బాలీవుడ్ సినిమా షారూఖ్ ఖాన్ సరసన 'ఓం శాంతి ఓం' 2007లో నటించారు.