Ayodhya Deepotsav: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం ప్రారంభం
అంతేకాకుండా దీపాలు వెలిగించడంలో అయోధ్య నగర అధికార యంత్రాంగం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పనుంది. మరో 32 ఘాట్లను కూడా విద్యుత్ దీపాలతో...ప్రమిదలు, దీపాలతో అలంకరించనున్నారు.
నగరాలంకరణే కాకుండా సరయూ నది తీరాన త్రీడి హోలోగ్రాఫిక్ షో, త్రీడి ప్రోజెక్షన్, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నగరంలోని అన్ని ఆలయాలు, చిన్న చిన్న సందులు, వీధులు, రహదారులు అన్నీ అద్భుతమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు.
నగరంలోని అన్ని ఆలయాలు, చిన్న చిన్న సందులు, వీధులు, రహదారులు అన్నీ అద్భుతమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు.
దీపాలు వెలిగించేందుకు అయోధ్య అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ కలిసి సంయుక్తంగా 12 వేల మంది వాలంటీర్లను నియమించాయి.
దీపోత్సవ వేడుకల్ని వరుసగా 5వ ఏట నిర్వహిస్తున్నారు. ప్రతి యేటా అయోధ్యలో దీపోత్సవం వైభవంగా జరుగుతూ వస్తోంది. రామ్ కథా పార్క్లో శిల్ప బజార్తో వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం అయోధ్యలో దీపావళి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దీపోత్సవ సంబరాల్లో భాగంగా మొత్తం నగరమంతా అలంకృతమైంది. బుధవారం జరగనున్న ముఖ్యమైన వేడుకలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు.