Delhi Elections 2025: మోగిన ఢిల్లీ ఎన్నికల భేరీ.. వేడెక్కిన హస్తిన రాజకీయాలు
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల ప్రకటన విడుదలైంది. రాజకీయాలకు కేంద్రంగా నిలిచే ఢిల్లీకి ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో రాజకీయాలు వేడెక్కాయి.
70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల ప్రకటనకు సంబంధించి ఎన్నికల సంఘం సమగ్ర వివరాలతో ప్రకటన విడుదల చేసింది.
ఎన్నికల ప్రకటన జనవరి 10వ తేదీన విడుదల కానుండగా.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 17.
నామినేషన్ల పరిశీలన జనవరి 18, నామినేషన్ల ఉపసంహరణ జనవరి 20వ తేదీన ఉంటాయి.
70 స్థానాలకు ఒకేసారి ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 8వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.
మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 13,033 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది.
మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలా సర్వేలు వెల్లడించాయి.